Site icon HashtagU Telugu

Tecno Spark Go: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో అదరగొడుతున్న టెక్నో స్మార్ట్ ఫోన్?

Mixcollage 06 Dec 2023 03 45 Pm 4408

Mixcollage 06 Dec 2023 03 45 Pm 4408

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో బ్రాండ్ ఇప్పటికే మార్కెట్ లోకి పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది టెక్నో. టెక్నో స్పార్క్‌ గో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ధర రూ. 6.699గా నిర్ణయించారు.

అలాగే ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో కూడా తీసుకొచ్చారు. కాగా ఈ ఫోన్‌ 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండడం ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ డిసెంబర్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌తో పాటు రిటైల్ ఔట్‌లెట్స్‌ లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. టెక్నో స్పార్క్‌ గో ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు.

90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ ఈ ఫోన్‌ సొంతం. తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.

Exit mobile version