Tecno Camon 20 Series: మార్కెట్ లోకి మరో టెక్నో స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ అదుర్స్?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఆయా స్మార్ట్ ఫోన్ తయార

  • Written By:
  • Updated On - May 30, 2023 / 09:42 AM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. టెక్నో కామన్‌ 20 సిరీస్‌ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్ లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను అధికారికంగా లాంచ్‌ చేసింది.

కాగా ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్‌ 20 ప్రీమియర్‌ 5జీ ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్‌ నెలాఖరున ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్ కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. టెక్నో కామన్‌ 20 ఫోన్ 16జీబీ ర్యామ్‌, 256 జీబీ రోమ్‌ వేరియంట్‌ ధర రూ.14,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు ప్రీడాన్‌ బ్లాక్‌, గ్లేసియర్‌ గ్లో, సెరెనిటీ బ్లూ వంటి లభించనుంది. ఈ ఫోన్‌ కి సంబంధించిన అమ్మకాలు నేటి నుంచి అనగా మే 29 నుంచి ప్రారంభం అయ్యాయి. కాగా టెక్నో కామన్‌ 20 ప్రో ఫోన్ విషయానికి వస్తే..

16జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వర్షన్‌ ధర రూ.19,999 గా ఉంది. 16జీబీ ర్యామ్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.21,999 గా ఉంది. ఈ ఫోన్ లు మనకు డార్క్‌ వెల్కిన్‌, సెరెనిటీ బ్లూ కలర్స్‌ లో లభించనున్నాయి. ఈ ఫోన్స్ జూన్‌ రెండో వారంలో నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్‌ప్లే, ఫుల్‌ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్‌ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్‌ సపోర్ట్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్, తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్,సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ, కాగా కామన్‌ 20 ఫోన్ లో 64ఎంపీ +2ఎంపీ +AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ తో రానుంది. ప్రో వేరియంట్‌ లో 64ఎంపీ +2ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4కె వీడియో రికార్డింగ్‌ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండడం ఉంది.