Site icon HashtagU Telugu

Metro tickets in WhatsApp : ఇకపై వాట్సాప్​లో మెట్రో టికెట్స్​ కొనవచ్చట.. ఎలా అంటే?

Mixcollage 26 Jan 2024 02 39 Pm 2700

Mixcollage 26 Jan 2024 02 39 Pm 2700

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది. దీంతో వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఇప్పటికే ఎన్నో విషయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగానే తాజాగా వాట్సాప్​ లోనే మెట్రో టికెట్స్​ కొనే ఫీచర్​ వచ్చేసింది. వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సర్వీస్​ అందుబాటులోకి రావడంతో మెట్రో స్టేషన్స్​లో టోకెన్స్​ తీసుకునే పని తప్పుతుంది. అయితే.. ఈ సేవలు ప్రస్తుతం చెన్నై మెట్రోకే అందుబాటులోకి వచ్చాయి. కోయంబెడు, ఎయిర్​ పోర్ట్​ మెట్రో స్టేషన్స్​లో వీటిని తొలుత ప్రవేశపెట్టారు.

అనంతరం చెన్నైలోని 41 మెట్రో స్టేషన్స్​లో వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సిస్టెమ్​ యాక్టివేట్​ అయ్యింది. ప్రయాణికుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్​ లభిస్తోంది. వాట్సాప్​లో మెట్రో టికెట్ల్​ కోసం ముందు కౌంటర్​కి వెళ్లాలి. మీ ఫోన్​ నెంబర్​ ఇవ్వాలి. మీ గమ్యస్థానాన్ని చెప్పాలి. ఎన్ని టికెట్స్​ కావాలో చెప్పాలి. కంప్యూటర్​కి కనెక్ట్​ అయిన కీప్యాడ్​లో ఫోన్​ నెంబర్​ టైప్​ చేయాలి. ఒక క్యూఆర్​ కోడ్​.. మీ వాట్సాప్​ నెంబర్​కి వస్తుంది. అక్కడే పేమెంట్​ ఆప్షన్​ కూడా ఉంటుంది. క్యాష్​, కార్డ్​, యూపీఐ ద్వారా పేమెంట్​ చేసుకోవచ్చు.

ఇది పూర్తిగా సెక్యూర్​ కూడా! పైగా మొబైల్​ నెంబర్స్​ని సర్వర్​లో సేవ్​ చేసుకోమని చెన్నై మెట్రో చెబుతోంది. అయితే తరచూ కాకుండా అప్పుడప్పుడు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలు ఉపయోగపడతాయి. పేపర్​ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితంగా మెట్రోను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది చెన్నై మెట్రో. ఈ వాట్సాప్​ టికెటింగ్​ సర్వీస్​తో మరో ముందడుగు వేసినట్టు పేర్కొంది. వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలతో.. ప్రతి నెల 4 టన్నుల పేపర్​ వాడకం తగ్గుతుందని తెలిపింది. ఖర్చులు కూడా దిగొస్తాయని స్పష్టం చేసింది.