Site icon HashtagU Telugu

Apple iPhone 15: మార్కెట్లోకి మరో ఐఫోన్ స్మార్ట్ ఫోన్.. మొట్టమొదటిసారి అలాంటి కలర్ లో?

Apple Iphone 15

Apple Iphone 15

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి అయినా ఉపయోగించాలి అనుకునే ఫోన్ ఐఫోన్. కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని యాపిల్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరలకు ఐఫోన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకు వస్తోంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన స్మార్ట్ ఫోన్ లలో డిఫరెంట్ కలర్స్, మరిన్ని ఫీచర్స్ ని తీసుకువస్తున్నారు.

ఇది ఇలా ఉంటే రాబోయే ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ పింక్ కలర్‌లో అందుబాటులో రానుందని సమాచారం. ఐఫోన్ 15 ఆకుపచ్చ, లేత పసుపు, గులాబీ రంగులలో వస్తుందని లీకులు వస్తున్నాయి. అయితే బ్లూ కలర్ కొత్త టైటానియం మెటీరియల్‌తో వస్తుందని, ఆపిల్ గతంలో కలిగి ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్‌కు బదులుగా బ్రష్డ్ ఫినిషింగ్ కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా, కంపెనీ ఐఫోన్ 15 ప్రో కోసం ముదురు ఎరుపు రంగును, ఐఫోన్ 15, 15 ప్లస్‌లకు ఆకుపచ్చ రంగును పరిచయం చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు అనేక కలర్స్ వచ్చాయి కానీ పింక్‌ కలర్‌లో రావడం ఇదే తొలిసారి.

దీంతో పాటు మిగిలిన రెగ్యులర్‌ కలర్స్‌లో కూడా ఐఫోన్‌ 15 వస్తుంది. కాగా, ఐ ఫోన్ 15 సిరీస్ విడుదల తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కాగా రాబోయే ఐఫోన్‌ 15లో కొత్త ఫీచర్స్‌ ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. A15 బయోనిక్ చిప్‌సెట్‌ని ఐఫోన్ 15లో చూడవచ్చు. ఇది డైనమిక్ ఐలాండ్ ఫీచర్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రావచ్చని, ఐఫోన్ 15లో USB టైప్ సి ఆప్షన్‌ను అందించడం మొదటి సారి అవుతుంది. అదే సమయంలో ఇది 48ఎంపీ ప్రధాన కెమెరా ఫీచర్‌లతో వచ్చే అవకాశం ఉంది. దీని ధర $799 నుంచి $849 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.65వేల నుంచి రూ.79 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా.