Site icon HashtagU Telugu

Youtube : యూట్యూబ్ కు ఏమైంది..?

Youtube

Youtube

యూట్యూబ్ (Youtube ) ఇప్పుడు ఇది లేనిదే ఏ పని జరగడం లేదు..చేయడం లేదు. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు అంత యూట్యూబ్ తోనే గడిపేస్తున్నారు. సమాచారాన్ని అందించడం తో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తుండడం తో చిన్న , పెద్ద , ముసలి ఇలా వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ లలో వీడియోస్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. రోజుకు లక్షల్లో డబ్బు సంపాదించే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. గత ఐదేళ్లుగా యూట్యూబ్ వాడకం బాగా పెరిగింది. అలాంటి యూట్యూబ్ లో ఇప్పుడు సాంకేతిక సమస్య (Technical Problem) వచ్చినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

4200 యూట్యూబ్లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లైవ్ వీడియోలకు వేలల్లో ఉండాల్సిన సంఖ్య కేవలం సింగిల్, డబుల్ డిజిట్లలోనే దర్శనమిస్తోందని పేర్కొంటున్నారు. యూట్యూబ్ కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇండియా తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు. మరి ఇది ఎందుకిలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Read Also : POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ