Site icon HashtagU Telugu

WhatsApp Tricks: ఇది విన్నారా.. వాట్సాప్ లో టైప్ చేయకుండానే మెసేజ్‌లు పంపవచ్చట.. అదెలా అంటే!

Whatsapp

Whatsapp

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకు కొద్దీ యూజర్స్ వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉంటారు. ప్రతిరోజు లెక్కలేనన్ని సందేశాలు పంపుకుంటూ ఉంటారు. కేవలం వాట్సాప్ మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్,టెలిగ్రామ్ ఇలా ఏ యాప్ లో ఇతరులకు మెసేజ్ పంపాలి అన్నా మెసేజ్లను టైప్ చేయాల్సిందే. దీంతో చాలామంది మెసేజ్లు ఎక్కువ సేపు టైప్ చేయడానికి అంతగా ఇష్టపడరు. మెసేజ్లకు బదులుగా చాలామంది వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు. అలాగే బయట ఉన్నప్పుడు, డ్రైవింగ్ లేదా ఏదైనా ఇతర కార్యకలాపంలో బిజీగా ఉన్నప్పుడు టైప్ చేయడం కష్టంగా మారుతుంది.

అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి? మీరు వాట్సాప్‌లో టైప్ చేయకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపవచ్చు. ఈ ఫీచర్ మీ వాయిస్ ఆధారంగా పని చేస్తుంది. అంటే మీరు మాట్లాడడం ద్వారా మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని చెప్పాలి. అలాగే మీరు చెప్పినది స్వయంచాలకంగా టైప్ అవుతూనే ఉంటుంది. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్‌ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇది అన్ని భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఇండిక్ కీబోర్డ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఆపై మీరు సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి చాట్‌ కి వెళ్ళాలి. ఇప్పుడు సందేశాన్ని టైప్‌ చేయడానికి కీబోర్డ్‌ను ఓపెన్‌ చేయాలి. అదనపు కీబోర్డ్‌ లు ఎగువన మైక్ గుర్తును కలిగి ఉంటాయి. దాన్ని క్లిక్ చేయాలి.

కానీ వాట్సాప్‌ లో వాయిస్ మెసేజ్‌ లు పంపడానికి కూడా మైక్ అందించబడిందని గమనించాలి. మీరు ఆ మైక్‌ ని ఉపయోగించవద్దు. మీరు కీబోర్డ్‌ లోని మైక్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మీ ముందు మైక్ కనిపిస్తుంది. మాట్లాడమని కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని మాత్రమే మాట్లాడాలి. మీ సందేశం పూర్తయిన తర్వాత మైక్ చిహ్నాన్ని నొక్కాలి. అయితే నేడు చాలా కీబోర్డ్‌లు ఇంగ్లీషు భాషతో పాటు ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు మాట్లాడినవన్నీ ఇక్కడ టైప్ అవుతాయి. తర్వాత సెండ్ బటన్ నొక్కితే సరిపోతుంది. అలాగే వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు పంపేందుకు గూగుల్ కూడా సహకరిస్తోంది. గూగుల్ ఫోల్డర్ లేదా యాప్ డ్రాయర్ నుండి గూగుల్ యాప్‌ ని తెరిచి, బిగ్గరగా ఓకే గూగుల్ అని చెప్పాలి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం వాట్సాప్‌ లో సుదీర్ఘ సందేశాన్ని టైప్ చేయడానికి బదులుగా, పంపవలసిన సందేశాన్ని చెప్పాలి. అప్పుడు ఏ సందేశం పంపాలని గూగుల్‌ అడుగుతుంది. ఈ విధంగా మీరు ఎలాంటి టైపింగ్ సమస్య లేకుండా వాట్సాప్ సందేశాన్ని పంపవచ్చు.