Site icon HashtagU Telugu

Tech Tips: ల్యాప్‌టాప్,కంప్యూటర్స్ నుంచి స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Tech Tips

Tech Tips

మామూలుగా మొబైల్ ఫోన్లను చార్జర్ తో ఛార్జ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చార్జర్ లేనప్పుడు పవర్ బ్యాంకుతో ఛార్జ్ చేస్తూ ఉంటాం.. ఇంకొన్నిసార్లు స్మార్ట్ ఫోన్ ని ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లతో చార్జ్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉండే వారు ఎక్కువగా ఇలాంటి పని చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఏం జరుగుతుంది? మొబైల్ బ్యాటరీఫై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ల్యాప్‌టాప్‌ లు ఉపయోగించే వ్యక్తులు తరచుగా అక్కడి నుండి తమ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకుంటారు.

చాలా మంది అడాప్టర్లతో చేసుకోక ఇలా ఛార్జ్‌ చేయడం అలవాటుగా మారుతుంది. చాలా మంది తమ మొబైల్ ఫోన్‌ లను సరిగ్గా ఛార్జ్ చేయలేకపోతున్నారు. మాములుగా అయితే స్మార్ట్‌ఫోన్ ఖచ్చితంగా అసలు ఛార్జర్‌ తో మాత్రమే ఛార్జ్ చేయాలి. అయితే ఎవరి దగ్గరైనా అసలు మొబైల్ ఛార్జర్ లేకపోతే, ఫోన్ ఛార్జ్ అయిపోబోతుంటే, ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ ను ఛార్జ్ చేస్తుంటారు. కానీ ఇలా క్రమం తప్పకుండా చేయడం అస్సలు మంచిది కాదట. ఎవరైనా ల్యాప్‌టాప్ నుండి తమ మొబైల్ ఫోన్‌ ను ఛార్జ్ చేస్తే, అది ఫోన్ బ్యాటరీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా చాలా ల్యాప్‌టాప్‌ లలో ఛార్జింగ్ కోసం ఉపయోగించగల యూఎస్‌బీ పోర్ట్‌ లు ఉంటాయి.

ల్యాప్‌టాప్‌ లోని USB పోర్ట్ సాధారణంగా ఫోన్‌ లను ఛార్జ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దానికి కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్ ఛార్జ్ అవుతుందట. ల్యాప్‌టాప్‌ తో మీ ఫోన్‌ ను పదే పదే ఛార్జ్ చేయడం వల్ల ఛార్జింగ్ వేగం దెబ్బతింటుందట. ల్యాప్‌టాప్ USB పోర్ట్‌ లు సాధారణంగా ఫోన్ ఛార్జర్‌ ల కంటే తక్కువ శక్తివంతమైనవని చెబుతున్నారు. ఫోన్ ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చట. ఒరిజినల్ ఛార్జర్ లేకుండా ఫోన్‌ ను ఛార్జ్ చేయడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు వస్తాయట. కొన్నిసార్లు ఫోన్ వేడెక్కి, పేలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ ను తరచుగా ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపుతుందట.