Site icon HashtagU Telugu

Tech Tips: మొబైల్ డిస్ప్లే పగిలిపోయిన అలాగే ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Tech Tips

Tech Tips

మామూలుగా మనం మొబైల్ ఫోన్లను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా కింద పడి పగిలిపోవడం అన్నది కామన్. ఇంట్లో పిల్లలు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మన మజాగ్రత్తగా ఉన్నప్పుడు కిందపడి కొన్నిసార్లు పైన ఉన్న గ్లాస్ మాత్రమే పగిలిపోద్ది కొన్ని కొన్ని సార్లు లోపల ఉన్న కాంబో కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇక కాంబో పగిలిపోయినప్పుడు వాటిని బాగు చేయించుకోవాలి అంటే వేలకు వేలు ఖర్చు చేయాలి. దీంతో చాలామంది డబ్బు లేక అలాగే పగిలిపోయిన ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా పాడైపోయిన కూడా అలాగే మొబైల్ ఫోన్ వినియోగిస్తూనే ఉంటారు. అని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు.

మీరు డిస్‌ ప్లే పగిలిపోయిన ఫోన్‌ ని ఉపయోగిస్తుంటే, ఆ పగుళ్ల ద్వారా ఫోన్ లోపలికి ధూళి లేదా దుమ్ము చేరుతుంది. దీంతో ఫోన్ పూర్తిగా దెబ్బతింటుంది. డిస్‌ప్లేతో పాటు ఇతర ఖర్చులు కూడా మీ ఫోన్‌ పై పడవచ్చు. ఫోన్ డిస్‌ప్లే లోపలి భాగాల కోసం సెక్యూరిటీ పొరలోకి మురికి చేరడం వల్ల ఫోన్‌ మరింత డ్యామెంట్‌ అయ్యే అవకాశం ఉందట. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పగిలినా లేదా పగిలిపోయినా మనం మునుపటిలా చేయలేము. ఎందుకంటే డిస్‌ప్లే అనేది ఫోన్‌కి కోర్, ఫోన్ పని చేయడానికి డిస్‌ప్లే అవసరం. డిస్‌ప్లేలో పగుళ్లు ఏర్పడి ఒక వైపు పని చేయకపోతే, మీరు ఇప్పటికీ ఫోన్‌ ని మరొక వైపు నుండి ఉపయోగిస్తుంటే, దాని టచ్ కొన్ని రోజుల తర్వాత పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. ఫోన్ విడుదల చేసే బ్లూ లైట్ కళ్లకు హానికరం. డిస్‌ప్లే పగిలిపోయినప్పుడు అందులోని బ్లూలైట్‌ నేరుగా మీ కళ్లపై పడినప్పుడు కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని అం టున్నారు నిపుణులు.

అయితే మొబైల్ డిస్‌ప్లే ఒక్కో విధంగా పాడైపోతుంది. స్క్రీన్ కవర్‌ని డిస్‌ప్లేపై ఉంచినప్పటికీ, కొన్నిసార్లు అది ఉపయోగపడదు. రోజువారీ ఉపయోగం మధ్య స్మార్ట్‌ఫోన్ స్క్రాచ్ అవుతుంది. అలాంటప్పుడు బేకింగ్ సోడా ను ఉపయోగించవచ్చు. మన వంటింట్లో దొరికే బేకింగ్ సోడా గీతలు తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో నీరు, బేకింగ్ సోడా కలపాలి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ ని ఉపయోగించి స్క్రాచ్‌ ను తొలగించాలి. అలాగే మార్కెట్లో అనేక కార్ స్క్రాచ్ రిమూవల్ క్రీమ్‌ లు ఉన్నాయి. వాటిలో దేనినైనా ఉపయోగించి మీ ఫోన్ డిస్‌ప్లే స్క్రాచ్‌ ను తొలగించవచ్చు. అలాగే ఎగ్ వైట్, పొటాషియం సల్ఫేట్ ఫోన్ స్క్రాచ్‌ లను తొలగించడానికి ఉపయోగించవచ్చు. రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమంతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ ను తుడవాలి. బేబీ పౌడర్‌ తో డిస్‌ప్లే స్క్రాచ్‌ లను కూడా తొలగించవచ్చని మీకు తెలుసా? ఒక గిన్నెలో నీరు, బేబీ పౌడర్ కలపాలి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ని ఉపయోగించి గీతలు పడిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేదంటే తక్కువ ఖర్చులో అయినా డిస్ప్లేను మార్చుకోవాలి. అలాగే ఉపయోగిస్తే మాత్రం మొబైల్ ఫోన్ పనిచేయకుండా అయిపోతుంది.