మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నప్పటికీ అందులో ఉన్న చాలా రకాల ఫ్యూచర్ల గురించి అస్సలు తెలియదు. ఏదో మొబైల్ ఫోన్ ని వాడుతున్నాం అంటే వాడుతున్నాం అన్నట్టుగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని అవసరాల కోసం తప్ప స్మార్ట్ ఫోన్లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మొబైల్ ఫోన్ డామేజ్ అవ్వడం బటన్స్ పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పవర్ ఆన్ చేసే బటన్ పాడైతే డిస్ప్లే ఆన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ నిజంగానే పవర్ బటన్ పాడైతే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫోన్ లాక్ చేయబడి ఫోన్ డిస్‌ప్లేలో లైట్ కూడా ఆఫ్‌లో ఉంటే మీరు పవర్ బటన్ ను నొక్కకుండానే ఫోన్ ను అన్‌లాక్ చేయగలరు. అదెలా అంటే.. నిజానికి మీ ఫోన్ సెట్టింగ్ ల లోనే అలాంటి ఉపయోగకరమైన ట్రిక్ ఉంది. మీరు దీన్ని అనుసరిస్తే, మీ ఫోన్ పవర్ బటన్ ఎప్పటికీ పాడైపోదట. లేదా పవర్ బటన్ పాడైపోయినట్లయితే ఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో మీకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లలో డబుల్ ట్యాప్ టు వేక్ అనే ఫీచర్ ఉంటుంది.
ఈ ఫీచర్ వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్ లలో వేర్వేరుగా ఉండవచ్చు. ఈ ఫీచర్ ద్వారా డిస్‌ప్లేను ఆన్ చేసుకోవచ్చట. పవర్ బటన్ మీ డిస్‌ప్లే ఓపెన్ చేయడానికి సహాయపడినట్లే, ఈ ఫీచర్ కూడా అదే విధంగా పని చేస్తుంది. కానీ ఈ ఫీచర్ ని ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ను నొక్కడానికి బదులుగా, మీరు డిస్‌ప్లైపై డబుల్ ట్యాప్ చేయాలి. మీరు డిస్‌ప్లేపై డబుల్ ట్యాప్ చేసిన వెంటనే డిస్‌ప్లేపై లైట్ వస్తుంది. అప్పుడు మీరు స్వైప్ చేయడం, పిన్ నమోదు చేయడం లేదా నమూనా సహాయంతో ఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీరు మీరు ఫోన్ సెట్టింగ్‌లలో Tap to Wake Up అనే ఈ ఫీచర్ ని కనుగొనవచ్చు. ఈ ఫీచర్ ఒక్కో ఓఎస్ లో ఒక్కో ప్రదేశంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఫోన్ సెట్టింగ్‌ల లోని సెర్చ్ టూల్ సహాయంతో దీనిని గుర్తించవచ్చు. పవర్ బటన్ దెబ్బతిన్నట్లయితే ఈ ఫీచర్ మీకు సహాయం చేస్తుంది. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఉపయోగించవచ్చు.