Site icon HashtagU Telugu

Tech Tips: మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా.. అయితే ఈ ట్రిక్స్ తో ఈజీగా తెలుసుకోండిలా?

Mixcollage 30 Jan 2024 02 56 Pm 2673

Mixcollage 30 Jan 2024 02 56 Pm 2673

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. చాలా రకాల వాటి కోసం ఈ మొబైల్ ఫోన్ ని వినియోగిస్తున్నాం. అయితే కొన్ని కొన్ని సార్లు చాలామంది వారి మొబైల్ నెంబర్ ను మర్చిపోతూ ఉంటారు. దాంతో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కావాల్సి వచ్చినప్పుడు ఇతరుల ఫోన్ నుంచి ఫోన్ చేసుకొని దాని ద్వారా నెంబర్ ని తెలుసుకుంటూ ఉంటారు. అయితే అలా కాకుండా ఇతరుల ఫోన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. USSD కోడ్‌ని ఉపయోగించవచ్చు.

వేర్వేరు టెలికాం కంపెనీలు వేర్వేరు USSD కోడ్‌లను కలిగి ఉంటాయి. వాటి ద్వారా మీరు మీ మొబైల్ నంబర్‌ను సులభంగా కనుగొనవచ్చు. Airtel: *282#, Vodafone: 1112# లేదా 5550#, Idea: 1214#, BSNL: *99#, Jio: *1#.. ఈ USSD కోడ్‌లను డయల్ చేసిన తర్వాత మీ ముందు మెను ఓపెన్‌ అవుతుంది. ఈ మెను నుంచి మొబైల్ నంబర్ ఎంపికను ఎంచుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ మీ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. అదేవిధంగా మీరు మీ టెలికాం కంపెనీకి చెందిన మై అకౌంట్ అప్లికేషన్ ను కలిగి ఉంటే మీరు మీ మొబైల్ నెంబర్ ను మరింత ఈజీగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అదేవిధంగా మీకు USSD కోడ్ లేదా మై అకౌంట్ యాప్ లేకపోతే మీ టెలికాం కంపెనీని సంప్రదించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, మీరు మీ మొబైల్ నంబర్‌ను మర్చిపోయారని చెప్తే చాలు. కంపెనీ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి నిర్దిష్ట సమాచారాన్ని అడుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా కంపెనీ మీ మొబైల్ నంబర్‌ను మీకు తెలియజేస్తుంది.