Site icon HashtagU Telugu

WhatsApp new feature: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఫేవరెట్ కాంటాక్ట్స్​​ తో ఆ పని మరింత ఈజీ!

Mixcollage 06 Feb 2024 03 38 Pm 1017

Mixcollage 06 Feb 2024 03 38 Pm 1017

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది.

కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఆ ఫీచర్ పేరు ఫేవరెట్ కాంటాక్ట్స్.. కాగా ఈ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​కి అర్థం దాని పేరులోనే ఉంది. సాధారణంగా ఫోన్​ కాంటాక్ట్స్​లో ఫేవరెట్స్​, స్పీడ్​ డయల్స్​ వంటివి ఉంటాయి. అదే విధంగా ఈ కొత్త ఫీచర్​తో వాట్సాప్​లో కూడా మనం మన ఫేవరెట్​ కాంటాక్ట్స్​ లిస్ట్​ని తయారు చేసుకోవచ్చట. అయితే ఈ ఫీచర్​ ప్రస్తుతం డెవలప్​మెంట్​ స్టేజ్​లోనే ఉందని సమాచారం. ఈ వాట్సాప్​ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​తో యూజర్లు తమకు ఇష్టమైన వారికి వీడియో, ఆడియో కాల్స్​ని సులభంగా చేసుకోవచ్చు.

దీనితో కాలింగ్​ ఎక్స్​పీరియన్స్​ మెరుగుపడుతుంది. అయితే ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​లో యూజర్లు.. తమ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ని ఎలా క్రియేట్​ చేసుకుంటారు? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ సంబంధిత కాంటాక్ట్​ని లాంగ్​ ప్రెస్​ చేస్తే, దాని పక్కన ఫేవరెట్​ ఆప్షన్​ రావచ్చు అని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ని ఎలా క్రియోట్​ చేసుకోవాలి అనేది తెలియాలి అంటే వేచి చూడాలి మరి. కాగా ఈ వాట్సాప్​ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా వందలాది కాంటాక్ట్స్​ ఉన్న వారు, తమకు ఇష్టమైన వారి నెంబర్లు ఇలా ఒక గ్రూప్​గా పెట్టుకుంటే, వెంటనే వీడియో, ఆడియో కాల్స్​ చేసేందుకు పని సులభమవుతుంది. ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎలా పని చేస్తుంది? అన్న వివరాలపై దిగ్గజ సోషల్​ మీడియా సంస్థ స్పందించాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి.