Site icon HashtagU Telugu

Tata Play Binge: సినిమా ప్రియులకు శుభవార్త.. టాటా బింజ్ ద్వారా ఒకే వేదికపై 17 ఓటీటీలు?

Tata Play Binge

Tata Play Binge

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తాజాగా టాటా ప్లే బింజ్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ను తెలిపింది. అదేమిటంటే ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో వివిధ ఓటీటీ వేదికల్లో ఉన్న కంటెంట్‌ను వీక్షించొచ్చు. అది ఎలా.. అందుకోసం ఏం చేయాలి అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ఏప్రిల్‌ లో ప్రారంభమైన ఈ యాప్‌ ఇప్పటి వరకు టాటా ప్లే డీటీహెచ్‌ సబ్‌స్క్రైబర్ల కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఒక్కొక్క సినిమాబు ఒక్కొక్క ఓటీటీలో వస్తుండడంతో వీక్షకులు వారికి నచ్చిన చిత్రం చూడాలంటే పలు సబ్‌స్క్రిప్షన్లను తీసుకోవాల్చి వస్తోంది.

ఇదే ఈ సమస్యతో చాలామంది బాధపడుతుండగా అటువంటి వారి కోసం తాజాగా గుడ్ న్యూస్ ని తెలిపింది. ఈ సమస్యకు పరిష్కారంగా తీసుకొచ్చిందే టాటా ప్లే బింజ్‌ . దీంతో ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో వివిధ ఓటీటీ వేదికల్లో ఉన్న కంటెంట్‌ను వీక్షించొచ్చు. ప్రస్తుతం టాటా ప్లే బింజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి 28,000 సినిమాలు, వెబ్‌ షోలు, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తం 17 స్ట్రీమింగ్‌ యాప్‌లు, గేమింగ్‌ ఒకే చోటకు వస్తాయన్న మాట. అలాగే ఇందులో ఏ సినిమా ఎందులో ఉందో వెతికే పని లేకుండా యాప్‌లో యూనివర్సల్‌ సెర్చ్‌ బార్‌ను ప్రత్యేకంగా ఇస్తున్నారు

కాగా ఈ టాటా ప్లే బింజ్‌ యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆయా ఓటీటీ వేదికల్లో ఉండే ఉచిత కంటెంట్‌ను ఎటువంటి రుసుము లేకుండానే వీక్షించవచ్చు. అయితే, ప్రీమియం కంటెంట్‌ కోసం మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.59తో నెలవారీ సభ్యత్వ ప్లాన్లు ప్రారంభమవుతున్నాయి. ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఒకేసారి రెండు పరికరాల్లో వీక్షించే వెసులుబాటు ఈ యాప్ లో ఉంది. నచ్చిన సినిమా లేదా షో ఏ ఓటీటీలో ఉందో వెతకడానికి సమయం తీసుకుంటుంది. ఓటీటీల సంఖ్యను బట్టి సబ్‌స్క్రిప్షన్‌ ధరలో మార్పు ఉంటుంది. అన్నీ ఓటీటీలూ కావాలంటే నెలకు రూ.299 చొప్పున చెల్లించాలి.