Site icon HashtagU Telugu

Tata Nano: ఎలక్ట్రిక్ వెర్షన్ లో టాటా చిట్టి కారు.. ధర, ఫీచర్స్ ఇవే?

Tata Nano

Tata Nano

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ చిన్న కారు నానో అండ్ సఫారీ స్టోర్మ్ ఎస్‌యూ‌విని ఏప్రిల్ 2020లో ఇండియాలో బి‌ఎస్ 6 ఇంధన ఉద్గార ప్రమాణాలని అమలు చేయడంతో నిలిపివేసినవిషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర అలాగే చిన్న కారుగా ప్రచారం పొందిన టాటా నానో ఇండియాలో కంపెనీకి సేల్స్ అందించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ కారు కంపెనీకి చాలా ముఖ్యమైనది మాత్రమే కాకుండా టాటా నానో కంపెనీ చైర్మన్ రతన్ టాటా హృదయానికి చాలా దగ్గరయ్యింది అని చెప్పవచ్చు.

ఈ టాటా నానో కారు ఉత్పత్తులను మే 2018లో నిలిపివేయబడ్డాయి. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ 624సీసీ, ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ తో పరిచయం చేసారు. అలాగే 38bhp పవర్ అండ్ 51Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా AMT గేర్‌బాక్స్‌ తో అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. టాటా నానో ను ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌తో మళ్లీ పరిచయం చేయాలని చూస్తోంది. టాటా నానో ఈవీ మెకానికల్ వివరాలు అలాగే సస్పెన్షన్ సెటప్ టైర్లలో ముఖ్యమైన మార్పులను మనం ఇందులో చూడవచ్చు. అయితే టాటా నానో ఈవీ ప్లాన్ ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయితే, మరమ లైనగర్‌ లోని ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం పై తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ చర్చలను తిరిగి ప్రారంభించవచ్చని నివేదికలలో వెల్లడించింది.

కానీ టాటా నానో ఎలక్ట్రిక్ కారు పై ప్రస్తుతం కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం, కంపెనీ ఇండియాలో మూడు ఈవీ లను విక్రయిస్తోంది. Tigor ఈవీ , Xpres-T, Nexon ఈవీ . తాజాగా టాటా టియాగో ఈవీ ధరలను రూ.8.49 లక్షల నుండి మొదలై రూ.11.79 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ డెలివరీలు జనవరి 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. టాటా టియాగో ఈవీ రెండు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడుతోంది. ఈ మోటార్ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 61bhp/110Nm, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 774bhp/114Nm పవర్ అవుట్‌ పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే టాటా నానో కారు చార్జింగ్ విషయానికొస్తే. 50kW DC ఫాస్ట్ ఛార్జర్ 57 నిమిషాల్లో 80% , 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్, 3.3kW హోమ్ ఛార్జర్ 5 గంటల్లో 5 నిమిషాలలో 100%, 19.2kWh బ్యాటరీ 6 గంటల 20 నిమిషాలు.