Talibans Praises Twitter : ట్విట్టర్ ను ఆకాశానికి ఎత్తిన తాలిబన్లు.. ఎందుకు ?

Talibans Praises Twitter : తాలిబన్లు తాజాగా సోషల్ మీడియాపై తమ మనసులోని మాటను వెల్లడించారు..

Published By: HashtagU Telugu Desk
Talibans Praises Twitter

Talibans Praises Twitter

Talibans Praises Twitter : వాళ్ళు స్త్రీ విద్యను వ్యతిరేకించారు.. 

వాళ్ళు కనీసం బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా మహిళలను అడ్డుకున్నారు.. 

అటువంటి తాలిబన్లు తాజాగా సోషల్ మీడియాపై తమ మనసులోని మాటను వెల్లడించారు..

ఆశ్చర్యకరంగా.. వాక్ స్వాతంత్య్రం గురించి కూడా వాళ్ళు మాట్లాడారు..

ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లకు ఇష్టమైన సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ అని తేలిపోయింది. “ట్విట్టర్ లో నెటిజన్లకు వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ .. అందుకే ఆ యాప్ అంటే  నాకు ఇష్టం” అని తాలిబాన్ నాయకుడు అనస్ హక్కానీ వెల్లడించాడు. నెటిజన్ల వాక్ స్వాతంత్ర్యానికి, విశ్వసనీయతకు ట్విట్టర్ ఎక్కువ విలువ ఇస్తోందని అతడు అభిప్రాయపడ్డాడు. ఈమేరకు ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అవుతోంది.

Also read : Sonia Gandhi Invite To AAP : ఆప్ కు సోనియా గాంధీ ఆహ్వానం.. జులై 17న 24 విపక్షాలకు డిన్నర్

“ఫేస్ బుక్ అనేది  ట్విట్టర్ కు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోంది.. ఫేస్ బుక్ లో నెటిజన్స్ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే వాతావరణం ఉండదు. ట్విట్టర్ లో  ప్రతి ఒక్కరూ తమ సందేశాన్ని బహిరంగంగా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. ట్విట్టర్ లో ఎంతోమంది ప్రముఖులు కూడా ఉంటారు. కాబట్టి ట్విట్టర్ లో చాట్స్ అనేవి చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకట్టుకుంటాయి. ట్విటర్ చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్” అని  అనస్ హక్కానీ పేర్కొన్నాడు.  తాలిబాన్లు కూడా ట్విట్టర్ లో ‘ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్గ్’ పేరుతో ఖాతాను నిర్వహిస్తున్నారు. ఆ అకౌంట్ కు వేలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు. అందులో ఉర్దూ భాషలో తరచుగా పోస్ట్‌ లు పెడుతుంటారు. అయితే తాలిబన్ల ఫేస్ బుక్ అకౌంట్స్ ను ఫేస్ బుక్ బ్లాక్ చేసింది.  ఈ కారణం వల్లే తాలిబన్లు ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారని (Talibans Praises Twitter) భావిస్తున్నారు.

  Last Updated: 12 Jul 2023, 01:31 PM IST