Site icon HashtagU Telugu

Fire Boltt Terminator: రూ. 2 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా.. ఫైర్-బోల్ట్ టెర్మినేటర్ పై ఓ లుక్కేయండి..

Take A Look At Smart Watch Fire Bolt Terminator Under 2 thousand..

Take A Look At Smart Watch Fire Bolt Terminator Under 2 thousand..

ఫైర్ బోల్ట్ (Fire Boltt) తన కొత్త స్మార్ట్ వాచ్ టెర్మినేటర్‌ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఫైర్ – బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్‌ వాచ్‌ ను ఫ్లిప్‌ కార్ట్‌ లో ఇప్పటికే విడుదల చేయగా, మంచి సేల్స్ అందుకుంటోంది. ఎన్నో మంచి ఫీచర్లు ఉన్నటువంటి ఈ కొత్త గాడ్జెట్ ని కంపెనీ ఫిట్‌ నెస్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా తయారు చేసింది. అతి పెద్ద డిస్ ప్లే, వాయిస్ అసిస్టెంట్, అతి తక్కువ ధర దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

అతి పెద్ద డిస్‌ప్లే:

Fire Boltt Terminator స్మార్ట్‌వాచ్ 240×283 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.99 – అంగుళాల HD డిస్‌ప్లేతో విడుదల కానుంది. దీనిలో 500 నిట్‌ల వరకు బ్రైట్‌ నెస్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇది ఫిట్‌నెస్ కార్యకలాపాలకు, కాల్స్ చేయడానికి నోటిఫికేషన్‌ లను చూడటానికి సరిపోతుంది. అదే సమయంలో, దీని డిజైన్ లుక్ కూడా చాలా స్టైలిష్‌ గా ఉంటాయి.

వాయిస్ అసిస్టెంట్ ఫీచర్

ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కాలింగ్ ఫీచర్‌తో పాటు, ఇది క్విక్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ సింక్ కాంటాక్ట్‌లను ఇందులో చూడవచ్చు. మీరు కాల్‌ని చేయడానికి ప్రతీ సారి ఫోన్‌ ఉపయోగించాల్సిన పని లేదు. ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటర్నల్ మైక్, స్పీకర్ ఉన్నాయి. ఈ ఫైర్ – బోల్ట్ స్మార్ట్‌ వాచ్‌ లో ఉన్న వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఇతర స్మార్ట్‌ వాచ్‌ల కంటే చాలా ప్రత్యేకంగా చేస్తుంది.

ఫిట్ నెస్ ట్రాక్ చేయవచ్చు..

ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్ వాచ్ 120+ స్పోర్ట్స్ మోడ్‌లతో పనిచేయనుంది. ఇది SpO2, హార్ట్ బీట్ ట్రాకింగ్, నిద్ర, శ్వాస, వంటి కొన్ని లక్షణాలను ట్రాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ల సహాయంతో, మీరు మీ రోజువారీ ఆరోగ్యం ఫిట్‌ నెస్ స్థాయిలను చాలా సులభంగా పర్యవేక్షించగలరు.

ఆటలు ఆడవచ్చు

ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్‌ వాచ్ ఇన్ – బిల్ట్ గేమ్ ఫీచర్‌లతో వస్తోంది. దీనిలో మీరు 2048, థండర్ బాటిల్‌ షిప్ యంగ్ బర్డ్ వంటి గేమ్‌లను ఆడవచ్చు. ఇందులో మీరు 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను పొందుతారు. ఈ స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. మరోవైపు, ఫైర్ – బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్ వాచ్‌ లోని ఫిట్‌నెస్ ఫీచర్‌ లతో పాటు, ఫైర్ – బోల్ట్ టెర్మినేటర్ వాతావరణ అప్‌డేట్‌లు, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, టార్చ్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌ లను వీక్షించడం వంటి స్మార్ట్ ఫీచర్‌ లను కూడా ఇందులో మీరు చూసుకోవచ్చు.

ధర ఎంతంటే..?

ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ ఫ్లిప్‌ కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఫైర్ – బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 1,999గా నిర్ణయించారు.

Also Read:  Money Earning: ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా?