Ear Phones: కొత్తగా బ్లూటూత్ ఇయర్ ఫోన్ కొనాలనుకొనే వారికి ఇది గుడ్ న్యూస్. బ్లూటూత్ కలిగిన నెక్ బ్యాండ్‌లలో ప్రస్తుతం చాలా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ధరల శ్రేణి కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మంచి ఆఫర్ కోసం ఎదురు చూసే వారికి లిమిటెడ్ ఆఫర్ ఒకటి ఇప్పుడు రెడీగా ఉంది. కంపెనీ దీన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసేలా కష్టమర్లను ఆకర్శిస్తోంది.
లాంచ్ ఆఫర్ కావడంతో కొద్ది రోజులే ఉంటుందని కంపెనీ ప్రకటించింది. వెంటనే తగ్గింపు ధరలో వీటిని మీ సొంతం చేసుకోవాలని కంపెనీ కోరింది. లేకపోతే తర్వాత ధర పెరిగిపోయే అవకాశం ఉంది. ఇండియన్ స్మార్ట్ వేరబుల్ సంస్థ స్కాట్.. తన మార్కెట్ ను మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగా నెకాన్ 101 పేరుతో బ్లూటూత్ నెక్ బ్యాండ్ ను ప్రవేశపెట్టింది.
స్కాట్ నెకాన్ 101 ఇయన్ ఫోన్స్ లో చాలా ప్రత్యేకతలున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, హెచ్ డీ స్టీరియో సౌండ్, ఎన్‌హ్యాన్స్‌డ్ బాస్ లాంటి అధునాతన ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. సుమారు 30 గంటల పాటు ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది. దీని ధర రూ.2 వేలు. అయితే, ప్రస్తుతం ఆఫర్ లో రూ.599కే కంపెనీ అందిస్తోంది.
ఇంట్రడక్షరీ ప్రైస్‌తో డిస్కౌంట్
ఇంట్రడక్షరీ ప్రైస్ పేరిట డిస్కౌంట్ తో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఇది బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది ప్రస్తుతం అవుటాఫ్ స్టాక్ గా ఉంది. ఈ నేపథ్యంలో స్కాట్‌లైఫ్.కామ్ వెబ్ సైట్ ను సందర్శించి స్కాట్ నెకాన్ 101 ఇయన్ ఫోన్ నెక్ బ్యాండ్ ను కొనుగోలు చేసే వీలుంది. సిలికాన్ మెటీరియల్ తో ఇవి తయారయ్యాయి.