ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ యాప్ ను కోట్లాదిమంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీగా దాకా ప్రతి ఒక్కరు ఇంస్టాగ్రామ్ ని వినియోగిస్తున్నారు. ఇక రోజు రోజుకి ఈ ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు వినియోగదారుల కోసం మరొకసారి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఆ వివరాల్లోకి వెళితే..
త్వరలోనే అందుబాటులోకి రానున్న ఆ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్ ను రీసెట్ చేసుకునే అవకాశం లభిస్తుందట. అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి అందుబాటులోకి రానుంది. కాగా ఇన్ కొత్త ఫీచర్ పై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని ద్వారా యూజర్లు తమ ఫీడ్ లలో ఏమి చూస్తారో నిర్ణయించే అల్గారిథమ్ ను రీసెట్ చేసుకోవచ్చు. టీనేజీ యువత భద్రత కోసం కొత్త ఫీచర్ ను రూపొందిస్తున్నట్ట మెటా తెలిపింది.
అల్గారిథమ్ అంటే ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు వారి ఫీడ్ లలో కంటెంట్ ప్రదర్శించే క్రమాన్ని నిర్ణయించే వ్యవస్థ. కొత్త ఫీచర్ల ద్వారా వినియోదారులు తమ ఫీడ్ లలో ఏమి చూస్తారో నిర్ణయించే అల్గారిథమ్ ను సెట్ చేసుకోవచ్చట. ఎక్స్ ఫ్లోర్, రీల్స్, ఫీడ్ ట్యాబ్ లతో సిఫారసు చేసిన కంటెంటె ను మాన్యువల్ గా రీసెట్ చేయడానికి వినియోగదారులకు కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి రీసెట్ చేసిన వెంటనే యాప్ గతంలో సూచించిన అంశాల నుంచి విడిపోతుందట. కొత్తగా సూచించిన ప్రాధాన్యతలకు అనుగుణంగా సిఫారసులు అందిస్తుందట. వచ్చిన కంటెంట్ పై ఆసక్తి ఉంది లేదా ఆసక్తి లేదు అనే గుర్తులు పెట్టడం ద్వారా నియంత్రణ ఏర్పడుతుంది. కాలక్రమీణా అల్గారీథమ్ సూచనలను మెరుగుపర్చుకోవచ్చు. యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.