భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వాహనాలు కంపెనీలలో బజాజ్ కంపెనీకి చెందిన వాహనాలు కూడా ఒకటి. ఇప్పటికీ ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల వాహనాలు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. వాటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఇటీవలే బజాజ్ పల్సర్ ఎన్ 125 విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ బైక్ స్లైలిష్ లుక్ తో యువతకు బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ బజాజ్ పల్సర్ ఎన్ 125 బైక్ ను రెండు రకాల వేరియంట్ లలో తీసుకువచ్చారు. ఈ బైక్ మన దేశంలో రూ.94,707 ప్రారంభ ధర కు అందుబాటులో ఉంది.
పల్సన్ శ్రేణిలో కొత్తగా చేసిన ఈ మోటారు సైకిల్ ఎంతో ఆకట్టుకుంటోంది. హెడ్ ల్యాంప్ లను పాయింటెడ్ ప్యానళ్లతో జత చేశారు. ల్యాంప్ ల కింద టెలిస్కోఫిక్ ఫోర్కులు మందపాటి ప్లాస్టిక్ ట్రిమ్ తో అమర్చారు. ఇంజిన్ పై నలుపు రంగును పేయింట్ చేశారు. స్ల్పిట్ స్పీట్లు దీనికి స్పోర్టివ్ లుక్ ను తీసుకు వచ్చాయి. చంకీ టైర్ హగ్గర్, స్మార్ట్ లుక్కింగ్ టెయిల్ ల్యాంపులు, సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అదనపు ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. అలాగే బజాజ్ పల్సర్ ఎన్ 125 మోటారు సైకిల్ రెండు రకాల ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. రెండింటిలో యూఎస్ బీ చార్జింగ్ తో బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. టాప్ స్పెక్ ట్రీమ్ ధర రూ.98,707 గా నిర్ధారణ చేశారు.
కొత్త పల్సర్ బైక్ లో 124.58 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 11.8 హెచ్ పీ, 11 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. బైక్ వెనుక భాగంంలో మోనోషాక్ సెటప్, ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు ఆకట్టుకుంటున్నాయి. ముందు భాగంగా 240 ఎంఎం, వెనుక భాగంలో 130 ఎంఎం స్టాపింగ్ పవర్ డిస్కులను ఏర్పాటు చేశారు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ బైక్ పనిచేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం 125 సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్ ట్రీమ్ బైక్ లు ఉన్నాయి. వాటికి బజాజ్ ఎన్ 125 గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు టెక్ నిపుణులు.
