Site icon HashtagU Telugu

Curb Accidents: డ్రైవర్ స్పీడు పెంచినా.. కునుకు తీసినా అలర్ట్ చేసే పరికరం.. స్కూల్ విద్యార్థుల ఆవిష్కరణ

School Students

School Students

అనుభవాన్ని మించిన గురువు ఉండడు అంటారు. ఆ స్కూల్ స్టూడెంట్స్ కొందరికి ఒక చేదు అనుభవం ఎదురైంది. తమ కళ్లెదుటే సైకిల్ పై వెళ్తున్న ఓ విద్యార్థి మీది నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన తర్వాత ఆ స్టూడెంట్స్ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. దానికి “హిఫాజత్” అని పేరు పెట్టుకున్నారు. పాఠశాల యాజమాన్యం కూడా వారికి వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు దోహదం చేసే ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణను గురుగ్రామ్ లోని శివ నాడార్ స్కూల్ కు చెందిన స్టూడెంట్స్ దియా సరీన్, అర్జున్ శెలట్, లక్షయ్ బజాజ్, అనావీ శర్మ ఆక్షిత అగర్వాల్, గౌరీ కపూర్ చేశారు.

ఏమిటా పరికరం ?

రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు.. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం. విరామం తీసుకోకుండా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా డ్రైవర్లకు నిద్రమత్తు కమ్ముకొస్తుంది. నిద్రమత్తు లో డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయే పెనుముప్పు ఉంటుంది.సరిగ్గా ఇటువంటి సమయాల్లో డ్రైవర్లను అప్రమత్తం చేయడమే విద్యార్థుల కొత్త పరికరం ప్రత్యేకత.

ఈ పరికరం ఎలా పనిచేస్తుంది ?

విద్యార్థులు తయారు చేసిన ఈ పరికరంలో Raspberry Pi 4 అనే సాఫ్ట్ వేర్ ఉంటుంది. దీని సాయంతో అది మినీ కంప్యూటర్ లా పనిచేస్తుంది. Raspberry Pi 4 అనే సాఫ్ట్ వేర్ కోడింగ్ లో ఉండే అల్గారితం ఎంతో ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది వాహన డ్రైవర్ మొహాన్ని నిరంతరం వీడియో తీస్తుంది. డ్రైవర్ నోరు, కళ్ల కదలికల్లో వచ్చే తేడాలను అతి సూక్ష్మ స్థాయిలో గుర్తిస్తుంది. ఇందులో నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి. ఒకవేళ డ్రైవర్ నోటితో గురక పెట్టినట్టు అనిపించినా.. కళ్ళు మూసుకుపోతున్నట్లు కనిపించినా వెంటనే అలారం మోగించి అలర్ట్ చేస్తుంది. ఈ సమాచారాన్ని ఆ వాహన యజమానికి కూడా మెసేజ్ రూపంలో పంపుతుంది. జీపీఎస్ టెక్నాలజీ తో లొకేషన్ వివరాలను కూడా షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పరికరం ధర 4వేల రూపాయల ధర ఉంటుందని అంటున్నారు. భవిష్యత్ లో దీన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే 2వేలకే లభిస్తుందని చెబుతున్నారు.

Exit mobile version