Aadhaar: ఆధార్ కు ఏ నెంబర్ లింక్ అయిందో మరిచిపోయారా.. ఇలా తెలుసుకోండి?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఒకటిగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కు ఆధార్ కార్డు అనుసంధానం తప్

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 04:32 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఒకటిగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ కార్డు నుంచి పాన్ కార్డ్ వరకు ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డ్ లింక్ అన్నది తప్పనిసరిగా మారిపోయింది. అయితే మామూలుగా మనం ఆధార్ నెంబర్ కు మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేస్తూ ఉంటాము. నా మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేసిన తర్వాత కొత్తగా మనకు ఇంకొక ఆధార్ కార్డు ను కూడా ఆధార్ సెంటర్లో తీసుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు ఆధార్ నెంబర్ కు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు అన్నది మర్చిపోతూ ఉంటారు. ఆ నెంబర్ వారి దగ్గర లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు.

అయితే మరేం భయం లేదు. అటువంటి వారి కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలను సులభంగా వెరిఫై చేసుకొనే వెసులుబాటును కల్పించింది. ఏ ఫోన్ నంబర్, ఈ మెయిల్ మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉందో తెలుసుకొనే అవకాశం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా కొందరు ఆధార్ కార్డు హోల్డర్స్ వారు తమ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారు. ఈ మెయిల్ ఐడీ ఏమి ఇచ్చారు వంటి వివరాలను మర్చిపోతుంటారు. దాంతో ఎప్పుడైన ఓటీపీలు కావాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికోసం యుఐడిఏఐ కొత్త విషయాన్ని తీసుకువచ్చింది. అందుకోసం ఆధార్ కార్డు హోల్డ్ దారిలో https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లి వెరిఫై ఈమెయిల్, మొబైల్ నంబర్ ను క్లిక్ చేయాలి.

అలాగే ఎంఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని వెరిఫై చేసుకోవచ్చు. దాంతో మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉన్న ఈ మెయిల్, ఫోన్ నంబర్ తెలుస్తోంది. ఒకవేళ లింక్ చేసి లేకపోతే నంబర్, ఈ మెయిల్ ఐడీ మార్చుకునేందుకు అవసరమైన సూచనలను కూడా ఇస్తుంది. అయితే ఒకవేళ మీ ఇప్పటికే మొబైల్ నంబర్ వెరిఫై అయితే మీకు ది మొబైల్ నంబర్ యూ హావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్ రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్ అని డైలాగ్ బాక్స్ డిస్ప్లే పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎంటర్ చేయడానికి మీకు ఫోన్ నంబర్ గుర్తులేదనుకోండి అప్పుడు మీ ఫోన్ నంబర్ లోని చివరి మూడు నంబర్లు కనిపిస్తాయి. దాని ద్వారా ఏ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉందో ఈజీగా గుర్తించవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ మార్చుకోవాలి అనుకుంటే దగ్గరలోని ఆధార్ సెంటర్ లో సంప్రదించాలి.