Site icon HashtagU Telugu

Star Link Internet: ఇంటర్నెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్?

Starlink

Starlink

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేనిదే బయటకు కదలము. ఇంటర్నెట్ సహాయంతో ప్రస్తుతం ప్రపంచం ముందుకు కదులుతుంది. అయితే అన్ని ప్రాంతాలలో ఈ ఇంటర్నెట్ సదుపాయం లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కేవలం పట్టణాలలో మాత్రమే మనకు కావాల్సిన ఇంటర్నెట్ దొరుకుతుంది అదే గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది.

ఇకపై మొబైల్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకురావడం కోసం ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ సంస్థ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఇలా శాటిలైట్ ఇంటర్నెట్ అందించడం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని మనం పొందవచ్చు. ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2,600 శాటిలైట్స్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. అయితే త్వరలోనే సాటిలైట్ మొబైల్ సేవలను కూడా అందించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే స్టార్ లింక్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC)’కు తాజాగా దరఖాస్తు చేసింది. 2 గిగాహెడ్జ్ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించిన ప్రత్యేక పరికరాలను తమ సాటిలైట్ కు అనుసంధానం చేయాలని కోరింది. ఇలా చేయడం వల్ల సాటిలైట్ నుంచి మొబైల్ ఫోన్ లకు ఫుల్ స్పీడ్ నెట్వర్క్ అందించే వెసులు బాటు ఉంటుంది. ఈ విధంగా FCC కి దరఖాస్తు చేస్తూ స్టార్ లింక్ సంస్థ తమ ప్రతిపాదనకు కారణాలు కూడా తెలిపారు. అమెరికన్లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఏం చేస్తున్నప్పటికీ తమతో మంచి కనెక్టివిటీ ఉండాలని చేతిలో పట్టుకొని చిన్న పరికరాలతో కూడా తమ కనెక్టివిటీ ఉండాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టార్ లింక్ సంస్థ వెల్లడించారు.

Exit mobile version