Text To Video : టెక్స్ట్‌ను వీడియోలుగా మార్చే ఏఐ సాఫ్ట్‌వేర్ ‘సోరా’ను ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ‘ఛాట్ జీపీటీ’ ఆవిష్కరించింది. యూజర్ అందించే టెక్ట్స్ సమాచారం ఆధారంగా ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను ‘సోరా’ (SORA) జనరేట్ చేయగలదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి టెక్ట్స్ నుంచి వీడియోను తయారు చేసే ఈ టెక్నాలజీ పెను సంచలనం క్రియేట్ చేయనుంది. ప్రత్యేకించి మల్టీ మీడియా, సోషల్ మీడియా, ఫిల్మ్ మేకింగ్ విభాగాల్లోనూ ఇది కొత్త విప్లవానికి బాటలు వేయనుంది. కెమెరా మోషన్లతో సహా వివిధ క్యారెక్టర్లను కూడా సోరా తయారు చేయగలదు. స్టిల్ ఇమేజ్ పోస్ట్ చేసినా దాని నుంచి కూడా వీడియోను సోరా రూపొందించగలదని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ సంస్థే స్వయంగా అంగీకరించింది. కొన్ని సందర్భాలను ఈ వీడియో జనరేటర్ (Text To Video) సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోందని పేర్కొంది. సోరాకు భాషపై లోతైన అవగాహన ఉందని, పరిమితులు ఉన్నాయని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ‘సోరా’ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే తేదీని ఇంకా ప్రకటించలేదు.
We’re now on WhatsApp. Click to Join
సోరా రెడీ చేసిన వీడియోలివీ
ఇప్పటికే గూగుల్ లూమియర్, రన్‌వే ఏఐ, పికా 1.0, Veed.io, Synthesia, రన్‌వే, Pika, Penaki వంటివి టెక్ట్స్-టు-వీడియో జనరేటర్లను తీసుకొచ్చాయి. అయితే ఇవేవీ 5 సెకన్లకు మించి వీడియోలను జనరేట్ చేయలేవు. వాటితో పోలిస్తే ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన సోరా దాదాపు 10 రెట్లు అధిక నిడివి కలిగిన వీడియోను జనరేట్ చేయగలదు. ‘సోరా’ జనరేట్ చేసిన కొన్ని వీడియోలను ఓపెన్‌ఏఐ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేసింది. పలువురు యూజర్లు ఇచ్చిన టెక్ట్స్ ప్రాంప్ట్ ఆధారంగా సోరా రూపొందించిన వీడియోలను ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
https://t.co/qbj02M4ng8 pic.twitter.com/EvngqF2ZIX
— Sam Altman (@sama) February 15, 2024
Also Read : Black Cat : నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?
తొలుత వీరి కోసం అందుబాటులోకి..
సెక్యూరిటీ ఫీచర్లను టెస్టింగ్ చేసిన తర్వాత ‘సోరా’కు సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తేవాలని ఓపెన్ ఏఐ కంపెనీ భావిస్తోంది. ఎందుకంటే ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్లను రూపొందించాలని కూడా అనుకుంటోంది. వీడియోల క్రియేషన్ విషయంలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా అడ్డుకునేందుకు ‘సోరా’లో సెక్యూరిటీ సెట్టింగ్స్ చేయనున్నారు. ఈ యాప్ పనితీరును అంచనా వేయడానికి తొలుత రెడ్ టీమర్ అనే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అందుబాటులోకి తెస్తారు. విజువల్ ఆర్టిస్టులు, ఫిల్మ్‌మేకర్లకు కూడా ఈ టెక్నాలజీని తొలి విడతగా ప్రయోగాత్మకంగా అందిస్తారని సమాచారం. ఎంటర్టైన్మెంట్ రంగంతో పాటు ఇంజనీరింగ్ రంగంలోనూ సోరా టూల్‌ను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.