Whatsapp Update: త్వరలో వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై ట్రాన్స్లేషన్ మరింత ఈజీ!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్ లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్ లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  • Written By:
  • Publish Date - July 15, 2024 / 10:30 AM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్ లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్ లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ. అయితే త్వరలోనే వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోందట.

ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పటికీ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఆప్షన్‌ లతో ఈ ఫీచర్‌ను మెరుగుపరచడంపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది వాట్సాప్ యాజమాన్యం. వాట్సాప్ అన్ని చాట్ సందేశాలను ఆటోమెటిక్‌గా అనువదించాలా? వద్దా? అని వినియోగదారులు ఎంచుకోవడానికి అనుమతించేలా ఒక సరికొత్త ఫీచర్‌ ను డెవలప్ చేస్తోంది. ఇది రాబోయే యాప్ అప్‌డేట్‌ లో చేర్చబడుతుంది. ఈ విధానం ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ను భద్రపరుస్తుంది. ఎందుకంటే వాటి పరిష్కారం పరికరంలో సందేశాలను ప్రాసెస్ చేస్తుంది.

అందువల్ల సందేశాలను అనువదించడానికి వాట్సాప్ కొన్ని భాషా ప్యాక్‌ లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ప్రారంభ దశ కోసం ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని భాషా అనువాద ఎంపిక మాత్రమే అందిస్తారు. భవిష్యత్తులో అప్‌డేట్‌లలో మరిన్ని భాషలకు మద్దతిచ్చే అవకాశం ఉన్న ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీతో సహా కొన్ని భాషలకు మాత్రమే మొదట్లో మద్దతు ఉంటుంది. వాట్సాప్ సంస్థ తీసుకురాబోతున్న ఈ సరికొత్త ఫీచర్ తో ఇకమీదట ఎలాంటి ట్రాన్స్లేటర్ యూస్ చేయకుండానే భాషను ఈజీగా అర్థం చేసుకోవచ్చట.