Site icon HashtagU Telugu

iPhones: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త.. అతి తక్కువ ధరకే ఐఫోన్స్?

Apple iPhones Ban

మార్కెట్లో ఐఫోన్ ఫోన్ లోకి ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ నీ ఫోన్ ని కొనుగోలు చేయాలని ఉపయోగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరల కారణంగా చాలామంది ఆ ఫోన్ ని కొనుగోలు చేయాలి అంటేనే భయపడుతూ ఉంటారు. ఐఫోన్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గత మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త సిరీస్‌‌లో ఫోన్లు మరింత అప్డేటెడ్‌గా వస్తుండటంతో, ఇవి ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో పాత ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వాటిల్లో ఐఫోన్ 13 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999 ధరకే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీని ధర రూ.50,000లోపు తగ్గే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం అధిక-నాణ్యత గల స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఐఫోన్ 13 ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుందని చెప్పవచ్చు. అవును తాజాగా వచ్చే ఐఫోన్ 15లో ఉండే ఫీచర్స్ ఇందులో ఉండకపోవచ్చు కానీ, ఈ ఐపోన్ 13 ఇప్పటికీ గొప్ప పనితీరు, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలు, అందమైన డిస్‌ప్లేతో కూడిన అద్భుత ప్యాకేజీని అందిస్తుందనడంలో సందేహం లేదు.

కాగా ఈ ఐఫోన్ 13 ఫోన్ 2021 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఐఫోన్ 12తో పోలిస్తే ఇందులో గొప్ప అప్డేట్స్ ఏమీ లేవు గానీ ఇది పవర్‌ఫుల్ A15 బయోనిక్ చిప్‌ని కలిగి ఉంటుంది. అలాగే స్టన్నింగ్ రెటీనా అమోల్డ్ డిస్‌ప్లే, మునుపటికన్నా మంచి కెమెరా సామర్థ్యాలు ఇందులో ఉంటాయి. కలర్ ఆప్షన్స్‌తో పాటు 5జీ కనెక్టివిటీకి మద్దతిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది కొన్ని సంవత్సరాల వరకు అప్డేట్స్‌ని అందుకుంటుంది. అంటే కొత్త మోడల్స్ విడుదలైనా, ఐఫోన్ 13కి తాజా ఐఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు అందుతాయి. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు డ్యూయల్ 12ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సాలిడ్ నైట్ మోడ్‌తో వివిధ లైటింగ్ పరిస్థితుల్లో శక్తివంతమైన, వివరణాత్మక ఫోటోలను ఈ తీయవచ్చు. ఐఫోన్ 15‌లో 48ఎంపీ లెన్స్‌ ఉన్నా ఐఫోన్ 13 ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం పోటీగానే నిలుస్తుందట.