Site icon HashtagU Telugu

Plastic Ear Buds: ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇయర్ బడ్స్ ని రూపొందించిన సోనీ.. ఎలా అంటే?

Ear Buds

Ear Buds

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ప్లాస్టిక్ వాడకం నిషేధించినప్పటికీ కొన్ని దేశాలలో ప్లాస్టిక్ ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం అలాగే పర్యావరణ రహిత కోసం జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ ఆ దిశగా కీలక కార్యాచరణ ను చేపట్టింది. ఇందులో భాగంగానే ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసి వచ్చిన ఆ వ్యర్థ పదార్థాలతో ఇయర్ బడ్స్ ని రూపొందిస్తుంది సోనీ సంస్థ.

పర్యావరణ రహిత కోసం తన వంతు సహాయంగా సోని సంస్థ ఈ రీసైకిల్ ప్లాస్టిక్ తో తయారుచేసిన ఇయర్ బడ్స్ కు లింక్ బడ్స్ ఎస్ ఎర్త్ బ్లూ టీడబ్ల్యూఎస్ అంటూ నామకరణం కూడా చేసింది. కాగా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేసిన ఆ ఇయర్ బడ్స్ ని నవంబరులో ఆసియా ఖండంలో కొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు. కాగా ఈ విషయం పై సోని సంస్థ స్పందిస్తూ లింక్ బడ్స్ సిరీస్ లో ఇవి కొత్త ఇయర్ ఫోన్స్ అని, ఎర్త్ బ్లూ కలర్ లో వస్తున్నట్టుగా వెల్లడించింది.అంతే కాకుండా ప్రపంచ పర్యావరణ రహిత కోసం తన వంతుగా రూ.4 కోట్ల విరాళాన్ని కూడా అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ సరి కొత్త లింక్ బడ్స్ లో మల్టీపాయింట్ కనెక్టివిటీనీ కూడా ఏర్పాటు చేశారు. ఇది రెండు డివైస్ లతో కూడా కనెక్ట్ అవుతుంది. ఈ ఇయర్ బడ్స్ నీ ప్లాస్టిక్ రహిత బాక్సులో ఉంచి విక్రయించనున్నారు.

Exit mobile version