Site icon HashtagU Telugu

Call Forwarding : మీ కాల్స్, మెసేజెస్ అపరిచితులకు ఫార్వర్డ్.. ఇలా ఆపేయండి

Call Forwarding

Call Forwarding

Call Forwarding : మీ ఫోనుకు వచ్చే కాల్స్ వేరే వాళ్లకు ఎప్పటికప్పుడు చేరితే ? మీ ఫోనుకు వచ్చే మెసేజెస్ వేరే వాళ్లకు ఎప్పటికప్పుడు చేరితే ? మీరు చేసే మనీ ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోతే ? చాలా డేంజర్!!  ఇది మీ ప్రైవసీకి భంగం కలిగిస్తుంది. మీ సైబర్ సెక్యూరిటీని ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. ప్రత్యేకించి కాల్ ఫార్వర్డింగ్, మెసేజ్ ఫార్వర్డింగ్ వల్ల ఈ ముప్పు పొంచి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

అందుకే అపరిచితులకు, అనుమానితులకు ఫోను ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారో గమనించాలి. ఒకవేళ వాళ్లు గనుక.. ఫోన్​ కీ ప్యాడ్​ మీద *401* అని టైప్‌ చేసి వాళ్ల ఫోన్ నెంబర్‌ ఎంటర్‌ చేసి డయల్ చేశారో అంతే సంగతి. మనకు తెలియకుండానే మన కాల్స్‌, మెసేజెస్ అన్నీ కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతుంటాయి. దీనివల్ల మన సాధారణ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన యూపీఐ, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతాయి.

Also Read : TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు

ఒకవేళ మీ ఫోన్‌‌కు వచ్చే కాల్స్‌, మెసేజెస్‌ వేరే ఫోన్ నంబరుకు ఫార్వర్డ్‌ అవుతుంటే ఆపడం చాలా ఈజీ. మీరు గాబరాపడాల్సిన అవసరం లేదు.  దీనికోసం ముందుగా మీ ఫోన్​ కీప్యాడ్​లో *#21# అని టైప్‌ చేసి డయల్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్‌లో కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయా? లేదా ? అనేది స్క్రీన్‌పైన కనిపిస్తుంది. మీ ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతుంటే, ఆప్షన్​ ఎనేబుల్‌‌లో ఉందని చూపిస్తుంది. వెంటనే ఆ ఆప్షన్​ డిజేబుల్‌ చేసుకోవడానికి మీ కీప్యాడ్​లో ##002# అని టైప్‌ చేసి డయల్ చేయండి. అంతే చాలు. దీంతో ఫార్వర్డ్‌ ఆప్షన్‌ వెంటనే డిజేబుల్‌ అయిపోతుంది. ఇక మీకు ఎలాంటి రిస్కు కూడా ఉండదు.

Also Read :AP Elections : జోరుగా ఎలక్షన్ బెట్టింగ్.. వీటిలోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌లు !?