Site icon HashtagU Telugu

Mahendra Reaction On Solar Car: సోలార్ కారు గురించి మీకు తెలుసా.. ఈ ఐడియాకు ఆనంద్ మహేంద్ర కుడా ఫిదా?

Solar Car

Solar Car

సాధారణంగా కారు నడవాలి అంటే పెట్రోల్ లేదా డీజిల్ అవసరం. కాగా ఈ మధ్యకాలంలో డీజిల్, పెట్రోల్ రేట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనితో కార్లకు పెట్రోల్,డీజిల్ కొట్టించాలి ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ పరిస్థితుల నుంచి బయట పడటం కోసం ఒక వ్యక్తి సరికొత్తగా ఆలోచించి ఏకంగా సోలార్ విద్యుత్తుతో నడిచే కారునీ తయారు చేశాడు. అయితే ఈ కార్ నీ తయారు చేయడం కోసం అతను ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు శ్రమ పడ్డాడు. అలా చివరికి అనుకున్న విధంగా సక్సెస్ సాధించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాశ్మీర్ లోని శ్రీనగర్ కీ చెందిన లెక్కల మాస్టర్ బిలాల్ అహ్మద్ స్వయంగా సోలార్ పవర్ తో పనిచేసే కారును తయారు చేశాడు.

అయితే మొదట ఆ కారును దివ్యంగుల కోసం తయారు చేయాలని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆర్థిక సమస్యల కారణాలవల్ల మరో ఆలోచన చేశారు. కారుకి డీజిల్, పెట్రోల్ తో పని లేకుండా కేవలం సోలార్ పవర్ తో పనిచేసేలా ఒక కారుని తయారు చేయాలని అనుకున్నాడు. అందుకోసం కారు అద్దాల పైన,బానేట్ పైన,ట్రంక్ పైన ఇలా కారు చుట్టూ సోలార్ ప్యానెల్లను సెట్ చేశాడు. అయితే అతను ఉంటున్న ఏరియాలో ఎప్పుడు వాతావరణం కూల్ గా ఉండటం వల్ల సాధారణ సోనార్ ప్యానల్ లతో విద్యుత్ తయారవ్వదు అని అనుకున్న అతను మోనో క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ ని ఉపయోగించారు. ఇవి తక్కువ వేడి వాతావరణం లో కూడా సోలార్ పవర్ ని తయారు చేయగలవు.

 

అయితే బిలాల్ అహ్మద్ తయారుచేసిన కారు చూడడానికి బాగా ఉండటంతో పాటు సైడ్ డోర్లు పైకి లేస్తాయి. అలా ఈ కారు వీడియోని చూసిన మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపుగా లక్ష మంది పైగా వీక్షించారు. అయితే ఈ కారుని మరింత తక్కువ ధరకే తయారుచేసి సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాలని చూస్తున్నాడు బిలాల్ అహ్మద్. ఈ కారు వీడియో పై మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద మహీంద్రా స్పందించారు. బిలాల్ అహ్మద్ ప్రయత్నం ని ఆయన మెచ్చుకుంటూ ఈ విధంగా పోస్ట్ ని రాసుకు వచ్చారు. బిలాల్ అభిరుచి ప్రశంసనీయం.. ఆయన ఒక్కరే ఈ ఫోటో ట్రైప్ తయారు చేయడం నేను మెచ్చుకుంటున్నాను.. నిజంగానే ఈ డిజైన్ కి ప్రొడక్షన్ ఫ్రెండ్లీ వెర్షన్ రావాలి.. బహుశా కాశ్మీర్ లోయలోని మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ అతన్ని కలిసి దీనిని మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది అని ఆయన ట్విట్ చేశారు.