Site icon HashtagU Telugu

E Book Reader: త్వరలోనే మార్కెట్లోకి ఈ బుక్ రీడర్ కళ్ళజోడు .. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

E Book Reader

E Book Reader

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పుస్తకాల స్వరూపం రోజురోజుకీ బాగా డెవలప్ అవుతోంది. ఇటీవల కాలంలో పుస్తకాలు పీడీఎఫ్ రూపంలోకి కూడా వచ్చేసాయి. కేవలం పీడీఎఫ్ మాత్రమే కాకుండా ఈపీయూబీ, ఏజెడ్‌డబ్ల్యూ, హెచ్‌టీఎంల్‌, పీడీబీ, డాక్స్‌ ఇలా రకరకాల ఫార్మాట్ లను కంప్యూటర్, ట్యాబ్‌, మొబైల్‌ ఫోన్ ల ద్వారా చదివే అవకాశం పాఠకులకు కలిగింది. ప్రస్తుతం ఈ-బుక్‌ రీడర్ లు ఎక్కువ మంది ట్యాబ్‌ లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి కళ్లపై ఒత్తిడి పడకుండా చదువుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి పాఠకులను ఆకట్టుకునేందుకు కొత్తగా మార్కెట్లోకి ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు రాబోతోంది.

మరి ఈ బుక్ రీడర్ కళ్ళజోడు ఏ విధంగా పని చేస్తుంది అందులో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోల్‌ రీడర్‌ అనే కంపెనీ సరికొత్త ఈ-బుక్‌ రీడర్‌ను అభివృద్ధి చేసింది. ఈ పరికరం చూడటానికి చలువ కళ్లద్దాలను మాదిరిగా ఉంటుంది. ఒక వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ను ధరిస్తే అందులోని కంటెంట్‌లో ఎలా లీనమవుతామో ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు అలాంటి అనుభూతినే కలిగిస్తుందట. పాఠకులు కిండిల్‌ వంటి ఈ-రీడర్లతో ఎక్కువ సేపు చదివేస్తున్నారు. మామూలు పుస్తకాల మాదిరిగానే అందులోని పేజీలను తిరగేస్తుంటారు. వాటిని చదువుతున్నప్పుడు కళ్ల మీద ఎలాంటి ఒత్తిడి పడదు. దానికి కారణం ఆ తెరల వెనకాల ఉన్న ఈ ఇంక్‌ డిస్‌ప్లే టెక్నాలజీ.

కానీ, పరిసరాల కారణంగా మనసు పుస్తకంలో నుంచి బయటకు వెళ్తుంది. అలాంటి అవాంతరాలకు ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు అడ్డుకట్ట వేస్తుంది. ఈ పరికరం ధరిస్తే అక్షరాలు తప్ప మరేవీ కనిపించవు. దాంతో ఏకాగ్రతగా ఎంత సేపయినా చదువుకోవచ్చు. ఈ-బుక్‌ చదవాలంటే ట్యాబ్‌, మొబైల్‌ను చేతితో పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ కళ్లజోడును కేవలం తలకు తగిలించుకుంటే సరిపోతుంది. సోల్ రీడర్‌లో 1.3 ఇంచుల సైడ్‌ లిట్‌ ఇ ఇంక్‌ డిస్‌ప్లే రావడం వల్ల ఇది కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఆ డిస్‌ ప్లే 65,536 పిక్సెల్స్‌తో వస్తుంది. ఇందులో డయాప్టర్‌ సర్దుబాటు సదుపాయం ఉంది. ఆ డయాప్టర్‌ను వినియోగించుకుని దృష్టి లోపం ఉన్న వారు తమ చూపునకు తగినట్లుగా అక్షరాలను మార్చుకోవచ్చు. కాగా ఈ కళ్లజోడు 100 గ్రాముల బరువు ఉంటుంది.

బ్లాక్‌ సన్‌ గ్లాసెస్‌ తరహాలో వీటి లుక్‌ డిజైన్‌ చేశారు. కూర్చుని లేదా పడుకొని చదువుకోవచ్చు. కంపెనీ ఇచ్చిన రిమోట్‌ను చేతిలో ఉంచుకొని బటన్‌లను నొక్కి కావాల్సిన పేజీ దగ్గర ఆపేయవచ్చు. ఈ-బుక్‌ రీడర్‌లోని పేజీలు నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌కు వ్యతిరేకంగా ప్రొజెక్ట్ అవుతాయి. దాంతో పాఠకుడికి మామూలు బుక్‌ చదువుతున్న అనుభూతి కలుగుతుంది. సోల్‌ రీడర్‌ బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. దాన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 30 గంటలపాటు వాడుకోవచ్చు. ఇందులో 60 ఎంబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఇచ్చారు. హెడ్‌సెట్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా అనుసంధానించుకొని ఆ యాప్‌లోకి చదుకోవాలనుకునే ఫైళ్లను కాపీ చేసుకోవచ్చు. ఒక్కోదాని ధర 350 డాలర్లు ఉంటుందని టెక్‌ వర్గాల సమాచారం.

Exit mobile version