Site icon HashtagU Telugu

Smartphones: ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్స్ ఇవే?

Wireless Charging Phones

Smartphones

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి నెలలో కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. మరి ఆ స్మార్ట్ ఫోన్ ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్.. ఈ ఫోన్ ఫిబ్రవరి నెలలో మార్కెట్లో విడుదల కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొత్త ఈ మొబైల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ S23 అల్ట్రా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వన్‌ప్లస్ 11.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వన్‌ప్లస్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ని ఫిబ్రవరి 7న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. షియోమీ 13.. షియోమీ తన తాజా 13 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను MWC 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కంపెనీ షియోమీ 13, షియోమీ 13 ప్రో రెండింటినీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫోన్ వచ్చే నెలలో ప్రపంచవ్యాప్త లాంచ్ అవుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఒప్పో సాంప్రదాయకంగా ఫిబ్రవరిలో దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన ఫైండ్ ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది.

Exit mobile version