Site icon HashtagU Telugu

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్‌ మారిస్తే చాలు.. మీ ఫోన్ ని ఎవరు దొంగతనం చేయలేరు!

Smartphone

Smartphone

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అన్నది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మనుషులు కూడా స్మార్ట్ ఫోన్ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఒక పూట ఆ ఫుడ్డు లేకపోయినా ఉండగలరేమో కానీ స్మార్ట్ ఫోన్ ని వినియోగించకుండా ఉండలేరు. అంతలా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు. ఇక ఫోన్ ని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాలు కూడా అందులో ఉంటాయి. అయితే అలాంటప్పుడు మన ఫోన్ ని ఇతరులు దొంగలించినప్పుడు ఆ వ్యక్తి డేటా తో పాటు ఫొటోస్ పర్సనల్ విషయాలు ఇలా ప్రతి ఒక్కటి అవుతారు వారికి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇక అలా మొబైల్ ఫోన్ వెళ్ళినప్పుడు కేసు పెట్టడం లేదంటే కొన్ని యాప్స్ ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయినా కూడా ఫలితం ఉండదు. దాంతో ఆ ఫోన్ గురించి వదిలేసి కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక మీదట ఫోన్ పోయిందని తినిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే పోయిన మీ ఫోన్ మళ్ళీ తిరిగి రాబట్టుకోవచ్చట. ఇందుకోసం మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో కొన్నింటిని మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి ఫోన్‌ ను పవర్ ఆఫ్ చేయడానికి పాస్‌వర్డ్‌ ను సెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల దొంగ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేరు. దీని కోసం, ముందుగా మీ ఫోన్‌ లోని సెట్టింగ్‌ ల యాప్‌ కి వెళ్ళాలి. ఇక్కడ మీరు సెట్టింగ్‌ లు, ప్రైవసీ ఎంపికకు వెళాళ్లి. దీని తర్వాత, మోర్ సెట్టింగ్, ప్రైవసీ ఎంపిక అందుబాటులో ఉంటుంది.

దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆపివేయడానికి పాస్‌వర్డ్ అవసరంపై క్లిక్ చేయాలి. ఇప్పుడు పవర్ ఆఫ్ ఫోన్ విత్ పాస్‌వర్డ్ టోగుల్‌ ని ఇక్కడ ఆన్ చేయాలి. మరి డివైస్ ను ఎలా కనుగొనాలి అన్న విషయానికొస్తే.. ఏదైనా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ ను ట్రాక్ చేయడానికి ఈ ఫీచర్‌ని ఆన్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సెక్యూరిటీ, ప్రైవసీపై క్లిక్‌ చేసి డివైజ్ ఫైండర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆపై మీ ఆఫ్‌లైన్ డివైస్‌ లను కనుగొనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి. ఇక్కడ మీరు అన్ని ప్రాంతాలలో నెట్‌వర్క్‌తో ఎంపికను ఎంచుకోవాలి.
దీని తర్వాత మీ ఫోన్‌ను ట్రాక్ చేయడం సులభం అవుతుంది. ఫోన్‌ దొంగిలించినట్లయితే దాని సహాయంతో ఫోన్‌ ఎక్కడుందో గుర్తించవచ్చు. మీరు ప్రభుత్వ అధికారిక CEIR వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp మీ స్మార్ట్‌ఫోన్ దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి బ్లాక్ చేయవచ్చు.

అదేవిధంగా మీ ఫోన్ దొంగతనం జరిగిన కూడా మీరు మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటే ఎల్లప్పుడూ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ కి యాక్సెస్‌ ను ఆఫ్ చేయాలి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఫోన్‌లో సెట్టింగ్‌ ను ఆన్ చేయవచ్చు. ముందుగా సెట్టింగ్స్‌ లోకి వెళ్లి, ఆ తర్వాత నోటిఫికేషన్‌ లు, స్టేటస్ బార్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరిన్ని సెట్టింగ్‌ ల ఎంపికకు వెళ్ళాలి. ఇక్కడ, నోటిఫికేషన్‌ ల టోగుల్‌ ను వీక్షించడానికి లాక్ స్క్రీన్‌పై స్వైప్ డౌన్‌ని ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్‌ ను అన్‌లాక్ చేయకుండా ఎయిర్‌ప్లేన్ మోడ్ యాక్సెస్ ఉండదు. ఈ విధంగా పైన చెప్పిన విషయాలు ఫాలో అయితే చాలు మీ స్మార్ట్ ఫోన్ ని ఎవరు దొంగలించలేరు. ఒకవేళ దొంగలించినా కూడా ఈజీగా మీరు వారిని ట్రేస్ చేయవచ్చు.