Reason For Having Small Holes In Your Smart Phone: స్మార్ట్ ఫోన్‌లో కనిపించే చిన్న రంధ్రం.. అసలు దాని వల్ల లాభాలు ఏంటి?

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది వరకు ఆండ్రాయిడ్ ఫోన్లను

  • Written By:
  • Updated On - July 27, 2022 / 09:58 AM IST

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి పది మందిలో దాదాపు 8 మంది వరకు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే వారిలో దాదాపు ఒక ఇద్దరు లేదా ముగ్గురు కో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఫీచర్ల గురించి తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడితే మరికొందరు స్మార్ట్‌ ఫోన్‌తోనే పనులన్నీ చక్కబెట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్‌ ఫోన్‌లో వెనుకవైపు కెమెరాల మధ్యలో అలాగే ఫ్లాష్‌ లైట్‌ పక్కన, ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్‌ పై వైపు ఉన్న ఫ్రేమ్‌లో, కింద ఛార్జింగ్‌ పోర్ట్‌ పక్కన ఉన్న చిన్నపాటి రంధ్రం ఉండటం గమనించి ఉంటారు. మరి ఆ రంధ్రం ఎందుకు ఉంది అన్నది చాలా మందికీ తెలియదు. మరి ఆ రంధ్రం ఎందుకు ఉంది? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దం వినిపిస్తుందని, అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాట స్పష్టంగా వినిపించడం లేదు అని చాలామంది చెప్పేవారట. అదే నాయిస్‌ డిస్ట్రబెన్స్‌. ఆ తర్వాత విడుదలైన స్మార్ట్ ఫోన్ లలో మొదట్లో వచ్చిన ఆ సమస్య రాలేదు. మళ్లీ ఆ సమస్య రాకపోవడానికి గల కారణం ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ చిన్న రంధ్రమే. ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్‌ ఉంటుంది. అది నాయిస్‌ క్యాన్సిలేషన్‌ డివైజ్‌గా పనిచేస్తుంది. దానివల్ల ఫోన్‌ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా ఒకరి మాటలు మరొకరికి స్పష్టంగా వినిపిస్తాయి. చాలా మంది ఫోన్ లో పలికి ఎయిర్‌ కోసం ఏర్పాటు చేశారని భావిస్తుంటారు. కానీ అది ఎయిర్ కోసం ఏర్పాటు చేసింది కాదు.