Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొంటారా ? టాప్ 5 ఆప్షన్స్ ఇవే

Top 5 Power Banks : పవర్ ​బ్యాంక్ కొనేందుకు రెడీ అవుతున్నారా ?

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 02:15 PM IST

Top 5 Power Banks : పవర్ ​బ్యాంక్ కొనేందుకు రెడీ అవుతున్నారా ? స్మార్ట్​ఫోన్​, స్మార్ట్​వాచ్​​ లాంటి డివైజ్‌లు అన్నింటినీ ఛార్జ్ చేసుకునేంత హై కెపాసిటీ పవర్​ బ్యాంక్ కోసం వెతుకుతున్నారా ? మీ అన్ని అవసరాలను తీర్చగలిగే మెరుగైన కెపాసిటీతో, బెటర్ క్వాలిటీతో మార్కెట్లో అందుబాటులో  ఉన్న టాప్​-5 పవర్​ బ్యాంక్​లపై(Top 5 Power Banks) ఓ లుక్కేద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

1. MI 3i Power Bank

ఎంఐ బ్రాండ్ నుంచి ‘ఎంఐ 3ఐ’ మోడల్ పవర్​ బ్యాంక్ రిలీజైంది. ఇది​ 18 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును ​ కలిగి ఉంటుంది. దీనిలో  ఉండే లిథియం పాలిమర్​ బ్యాటరీ కెపాసిటీ  10,000 mAh. మైక్రో యూఎస్​బీ, టైప్ -సీ ఇన్​పుట్​ పోర్టులు కూడా పవర్ బ్యాంకులో ఉంటాయి. రెండు అవుట్​పుట్ పోర్టులు కూడా ఉంటాయి.

2. MI Power Bank Pocket Pro

ఎంఐ బ్రాండ్ నుంచి ‘ఎంఐ పవర్ బ్యాంక్ పాకెట్ ప్రో’ మోడల్ పవర్ బ్యాంక్ రిలీజైంది. దీని కెపాసిటీ 10,000 mAh. ఇది 22.5 ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. దీనిలో మైక్రో యూఎస్​బీ, టైప్​-సీ ఇన్​పుట్ పోర్టులతో పాటు 3 అవుట్​పుట్​ పోర్టులు ఉంటాయి. ఇది పాకెట్ సైజులో, లైట్​ వెయిట్​తో ఉంటుంది.  దీన్ని మనం ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

3. Redmi Power Bank

రెడ్‌మీ బ్రాండ్ నుంచి ‘రెడ్‌మీ పవర్ బ్యాంక్’  విడుదలైంది. ఇది 10 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీని కెపాసిటీ 10,000 mAh. ఇందులో మైక్రో యూఎస్​బీ, టైప్ సీ రకానికి చెందిన డబుల్ యూఎస్​బీ పోర్టులు ఉన్నాయి.

4. Portronics Luxcell Power Bank

పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి ‘పోర్ట్రానిక్స్ లక్స్ సెల్ పవర్ బ్యాంక్’ విడుదలైంది. దీని కెపాసిటీ  10,000 mAh. ఇది ​ 22.5 వాట్​​ అవుట్​పుట్‌ను అందిస్తుంది. దీనిలో యూఎస్​బీ-ఏ, 2 x యూఎస్​బీ-సీ డ్యూయెల్ పోర్టులు ఉన్నాయి. దీనికి BIS సర్టిఫికేషన్ చిప్ ప్రొటెక్షన్ గ్యారెంటీ కూడా ఉంది. ఇందులో ఎల్​ఈడీ బ్యాటరీ ఇండికేటర్​, కాంపాక్ట్ డిజైన్​, టైప్-సీతో సహా టైప్​-సీ కేబుల్ కూడా ఉంటాయి.

5. Amazon Basics Power Bank

అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ నుంచి ‘అమెజాన్ బేసిక్స్ పవర్​ బ్యాంక్​’ విడుదలైంది. ఇందులో  లిథియం-పాలీమర్​ బ్యాటరీ ఉంది. ఇది 22.5 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. ఈ బ్యాటరీ కెపాసిటీ 10,000 mAh. దీనిలో  టైప్​-సీ అవుట్​పుట్​, 2 యూఎస్​బీ పోర్ట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మూడు అవుట్​పుట్ పోర్టులు ఉన్నాయి. ​

Also Read : AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్