దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అందుకు గల కారణం వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్స్. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఇప్పటికి ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించిన వాట్సప్ సంస్థ ప్రస్తుతం ఒక సమస్యకు చెక్ పెట్టడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఇంతకీ ఆ సమస్య ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్ లో ఏదైనా విషయాన్ని టైప్ చేయడం కన్నా వాయిస్ రూపంలో పంపించడం చాలా సులువు. కానీ వాయిస్ బయటకు వినిపిస్తుంది కాబట్టి,అది వినేవారు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు కానీ,సినిమా థియేటర్ లోనో, బయట ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడో, కార్యాలయంలో విధులు నిర్వర్తించే సమయంలోనూ, ట్రాఫిక్ లోనూ ఉంటే ఇబ్బందులు తప్పవు. అయితే ఈ సమస్యకు వాయిస్ మెసేజ్ టాన్స్కిప్ట్ ఫీచర్ పరిష్కారం చూపుతుంది. వాయిస్ ను టెస్ట్ రూపంలో మనకు కనిపించేలా చేస్తుంది. 2024 నవంబర్ లోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ ప్రకటించింది. ఇప్పడు ఆండ్రాయిడ్ వినియోదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఐఓఎస్ వినియోగదారులు వాడుకునే అవకాశం ఉందట. వాయిస్ మెసేజ్, దాని టెక్ట్స్ ట్రాన్క్రిప్ట్ రెండూ వాట్సాప్ నుంచి చాలా సురక్షితంగా నిర్వహించుకోవచ్చట.
దీని ద్వారా ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగల్, రష్యన్ తో పాటు పలు భాషల్లో వాయిస్ సందేశాలను చదవటానికి అవకాశం ఉందట. అయితే హిందీకి అధికారిక మద్దతు లేదట. వాట్సాప్ ఫీచర్ ను మెరుగుపర్చడం, పెద్ద యూజర్ బేస్ ను తీర్చిదిద్దే ప్రయత్నంలో అనేక భాషలకు దీన్ని విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో హిందీలో కూడా అందుబాటులోకి వస్తుందట. అయితే టాన్క్రిప్షన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకునేందుకు వినియోగదారులు వాట్సాప్ సెట్టింగ్ ల మెనూ నావిగేట్ చేయాలి. చాట్స్ అనే దాన్ని ఎంపిక చేసుకుని. దానిలో వాయిస్ మెసేజ్ టాన్క్రిప్ట్ విభాగానికి వెళ్లాలి. దీంతో వారికి కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అనంతరం అక్కడ చూపిన వాటిలో నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. అనంతరం యూజర్ తనకు వచ్చిన మెసేజ్ ను నొక్కి పట్టుకుని, మరిన్ని ఎంపికలను ఎంచుకుని, ఆపై ట్రాన్స్ క్రైబ్ ఎంపిక చేసుకోవడం ద్వారా వాయిస్ మెసేజ్ లను నచ్చిన భాషలో చదువుకోవచ్చట. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి.