ZOOM APP : జూమ్ యాప్ యూజర్లకు షాక్…నిలిచిపోనున్న సేవలు..!!

జూమ్ యాప్...కోవిడ్ సమయంలో వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల నుంచి ఆఫీసులో నిర్వహించే ఆన్ లైన్ మీటింగ్స్ వరకు....అన్నీ జూమ్ యాప్ లోనే జరిగేవి.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 07:08 PM IST

జూమ్ యాప్…కోవిడ్ సమయంలో వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల నుంచి ఆఫీసులో నిర్వహించే ఆన్ లైన్ మీటింగ్స్ వరకు….అన్నీ జూమ్ యాప్ లోనే జరిగేవి. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి క్రోమ్ బుక్స్ ల్యాప్ టాప్ లలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం యూజర్ల పెద్ద షాకే అని చెప్పవచ్చు

ల్యాప్ టప్ కంటే లిమిటెడ్ సపోర్టుతో గూగుల్ క్రోమ్ బుక్స్ ను రిలీజ్ చేసింది. వీటిలో విండోస్ సపోర్టు చేయదు. గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రోమా ఓఎస్ మాత్రమే వినియోగించుకోవచ్చు. క్రోమ్ బుక్స్ కు సపోర్టు చేసే జూమ్ లాంటి యాప్స్ తోపాటుగా ఇతర యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2020ప్లాన్ లో భాగంగా యూజర్లకు ఫస్ట్ క్లాస్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను గూగుల్ అందించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.

కాగా జూమ్ మాదిరిగానే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్టుగా సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని మనకు కావాల్సిన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకునే సాంకేతికతపై కసరత్తులు కూడా చేసింది. క్రోమా ఓఎస్ ఆధారిత క్రోమ్ బుక్స్ లో క్రోమ్ యాప్స్ ను నిలిపివేయనుంది. వాటిలో జూమ్ యాప్ కూడా ఒకటి. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ కు మాత్రమే అనుమతిస్తుండగా…గూగుల్ నిర్ణయంతో జూమ్ కూడా క్రోమ్ బుక్స్ లో సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఒకవేళ క్రోమ్ బుక్స్ లో జూమ్ యాప్ కావాలనుకుంటే జూమ్ ఫర్ క్రోమ్ పీడబ్ల్యూఏ వాడాలని జూమ్ సంస్థ క్రోమ్ బుక్ యూజర్లకు విజ్ణప్తి చేసింది.