Site icon HashtagU Telugu

Instagram : మెటాకు షాక్, ఇన్ స్టా గ్రామ్ కు భారీగా జరిమానా..యూజర్ల ప్రైవసీ ఉల్లంఘనకే..!!

Most Popular App

Instagram

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కు భారీ షాక్ తగిలింది. సెక్యూరిటీ విషయంలో ఐర్లాండ్ రెగ్యూలేటర్లు భారీ జరిమానా విధించారు. యువత గోప్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని 32 బిలియన్ల భారీ జరిమానాను విధించింది. యువత ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ గోప్యత విషయంలో ఇన్ స్టా నిబంధనలు ఉల్లంఘించిందని ఐర్లాండ్ రెగ్యూలేటర్లు పేర్కొన్నారు.

సైబర్ నేరగాళ్లు ఇన్ స్టా ప్రొఫైల్లో ఉన్న పర్సనల్ డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి బిజినెస్ అకౌంట్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. పర్సనల్ డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్న క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఈ జరిమానాపై అప్పీల్ చేసేందుకు రెడీ అయ్యింది. కాగా ఇన్ స్టాగ్రామ్ పై ఇప్పటికే మూడు సార్లు జరిమానా విధించింది.