మనం కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ తో అనుకోకుండా వేరే రాంగ్ యూపీఏ కి డబ్బులు పంపి చేస్తూ ఉంటాం. ఒక చిన్న నెంబర్ మిస్టేక్ అయినా చాలు ఒక అకౌంట్ కి పంపించాల్సిన డబ్బులు వేరే అకౌంట్ కి పంపించేస్తూ ఉంటాం. అలా డబ్బులు వెళ్ళినప్పుడు చాలామంది చిన్న మొత్తంలో అయితే పర్లేదు అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు పెద్ద అమౌంట్ పంపించినప్పుడు ఏం చేయాలో తెలియక బ్యాంకులను సంప్రదిస్తూ ఉంటారు. గుర్తు తెలియని వ్యక్తికి లేదా మీకు తెలియని వారికి పంపినట్టు అయితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కూడా ఒకవేళ రాంగ్ యూపీఐ నెంబర్ కు డబ్బులు పంపించి ఉంటే మీ డబ్బును 24 గంటల నుంచి 48 గంటలలోపు తిరిగి పొందవచ్చట.
మీరు డబ్బు పొందిన వ్యక్తితో పాటు మీరు ఇద్దరూ ఒకే బ్యాంక్ ని ఉపయోగిస్తుంటే ఈ రీఫండ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అయితే వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీలు అయితే మాత్రం కొంత సమయం పట్టవచ్చట. ఇలాంటి పరిస్థితులలో సాయం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగా పొరపాటున డబ్బు అందుకున్న వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించాలి. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని వారిని మర్యాదపూర్వకంగా అడగాలి. లావాదేవీ వివరాలను వారికి అందించాలి. మీకు తెలియని వ్యక్తికి డబ్బు పంపితే.. ఆ వ్యక్తి మీకు సహకరించకుంటే లేదా మీరు వారిని సంప్రదించలేకపోతే మీ యూపీఐ యాప్ కస్టమర్ సపోర్ట్ కి లావాదేవీని రిపోర్టు చేయాలి. లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలు, సాక్ష్యాలను వారితో షేర్ చేయాలి. వాపసు ప్రక్రియ కోసం మీకు సహాయపడేందుకు సాధ్యపడుతుంది.
మీరు కస్టమర్ సపోర్ట్ ద్వారా సమస్యను పరిష్కరించలేకపోతే మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయవచ్చు. అన్ని లావాదేవీల వివరాలను, ఏవైనా సహాయక సాక్ష్యాలను వారికి అందించాలి. వారు సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తారు. పొరపాటున జరిగిన లావాదేవీ గురించి వీలైనంత త్వరగా మీ బ్యాంకుకు తెలియజేయడం మంచిది. వారికి అవసరమైన అన్ని వివరాలను అందించాలి. డబ్బును రికవరీ చేసేందుకు వారు ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. అయితే రాంగ్ యూపీఐ అడ్రస్ లావాదేవీ జరిగితే.. మీరు సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ కి 1800-120-1740 కాల్ చేయవచ్చు. ఒకవేళ వేరే వేరే బ్యాంకులో లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే కస్టమర్‌లు వారి సొంత బ్యాంక్ బ్రాంచ్ సంప్రదించడం చేయాలి. లావాదేవీ మొత్తం, ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, ఏయే బ్యాంకులు వంటి అవసరమైన అన్ని వివరాలను వారికి అందించాలి.
సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం బ్యాంకుకు చాలా కీలకం. మీ బ్యాంక్ రిఫండ్ ను ప్రాసెస్ చేయడానికి డబ్బు పొందిన వ్యక్తి బ్యాంక్ తో కలిసి పనిచేస్తుంది. అయితే మల్టీ బ్యాంకుల ప్రమేయం కారణంగా దీనికి ఎక్కువ సమయం పట్టవచ్చట. ఒకవేళ మీరు రాంగ్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు పంపినట్లయితే లావాదేవీ వివరాలతో పాటుగా మీ యూపీఐ కస్టమర్ సపోర్ట్ కి రిపోర్ట్ చేయాలి. వారు మీ డబ్బు వాపసు ప్రక్రియలో సాయం చేయగలరు. తదుపరి దశలపై మీకు మార్గనిర్దేశం చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే రాంగ్ పేమెంట్ గురించి మీ బ్యాంక్‌కు తెలియజేయాలి. బ్యాంకులు ఆ డబ్బును రికవరీ చేసేందుకు ఛార్జ్‌బ్యాక్ ను ప్రారంభించవచ్చు. అవసరమైతే మీరు ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి విచారణ కోసం అన్ని లావాదేవీల వివరాలు, సాక్ష్యాలను అందించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చట.