ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే స్టేటస్ విషయంలో ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన తెలిసిందే. అయితే మామూలుగా స్టేటస్ పెట్టిన 24 గంటల తర్వాత డిలీట్ అవుతుంది. అయితే వాట్సాప్ స్టేటస్‌లను, వారికి తెలియకుండానే చూసేందుకు కొన్ని టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే అవతలి వ్యక్తికి తెలియకుండా సీక్రెట్‌గా వారి వాట్సాప్ స్టేటస్ చూడటానికి ఎక్కువ మంది ఉపయోగించే ట్రిక్ రీడ్ రిసిప్ట్స్ డిసేబుల్ చేయడం.
అయితే దీన్ని ఆఫ్ చేయడం వల్ల మీరు అవతలి వ్యక్తి రీడ్ స్టేటస్ తెలుసుకోలేరు. మీరు పంపే మెసేజ్‌ను వారు చదివారా లేదా అనేది కూడా తెలియదు. అయినా కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వాలనుకునే వారు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ సెక్షన్‌లో రీడ్ రిసిప్ట్స్ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సాప్ డెస్క్‌టాప్‌ని ఉపయోగించేవారు ఇన్ కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు వాట్సాప్ స్టేటస్ అవతలి వ్యక్తికి తెలియకుండా చూడొచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ వాట్సాప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడటానికి ఫైల్ మేనేజర్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఫైల్ మేనేజర్‌లో వాట్సాప్ ఫోల్డర్‌లో వాట్సాప్ స్టేటస్ ఫొటోలు, వీడియోలు కనిపిస్తాయి. అందుకు ఫైల్ మేనేజర్, ఇంటర్నల్ స్టోరేజ్,వాట్సాప్, మీడియో, స్టేటస్ ఫోల్డర్‌పై క్లిక్ చేయాలి.
ఈ ఫోల్డర్‌లో మీ వాట్సాప్‌లో కాంటాక్ట్స్ వారి స్టేటస్ ద్వారా షేర్ చేసిన ఫొటోలు లేదా వీడియోలను చూడవచ్చు. ఇలా చూడటం వల్ల అవతలి వ్యక్తికి మీరు వారి స్టేటస్ చూసినట్లు తెలియదు. కొన్ని ఫోన్‌లలో స్టేటసెస్ ఫోల్డర్ హైడ్ అయి ఉంటుంది. ఇలాంటప్పుడు టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీడాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి హిడెన్ ఫైల్స్ చూపించేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లు స్టేటస్ సేవర్ వీడియో డౌన్‌లోడ్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా సీక్రెట్‌గా కొత్త స్టేటస్‌లను చూడవచ్చు.మీరు వాట్సాప్ స్టేటస్ వ్యూని సీక్రెట్ గా ఉంచాలనుకుంటే మీ కాంటాక్ట్స్ షేర్ చేసిన మీడియా సరిగ్గా ఎక్స్‌పైర్ అయ్యే 30 సెకన్స్ లేదా ఓ నిమిషం ముందు చూడాలి. దీనివల్ల అవతలి వ్యక్తి మీరు చూశారనే విషయం ట్రాక్ చేయడానికి టైమ్ ఉండదు. అలాగే మీ మొబైల్ డేటాను ఆఫ్ చేయడం లేదా వైఫై డిస్‌కనెక్ట్ చేయడం ద్వారా కూడా అవతలి వ్యక్తికి తెలియజేయకుండానే వారి స్టేటస్ చెక్ చేయవచ్చు.