Site icon HashtagU Telugu

SBI ATM Rules: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే!

Sbi Atm Rules

Sbi Atm Rules

కాగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఈ నియమం తర్వాత మీరు ఏదైనా ఇతర బ్యాంకు ఏటీఎం నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ విత్‌ డ్రా చేస్తే, మీరు ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందట. అయితే మామూలుగా ఇప్పటి వరకు ఎస్బిఐ ఏటీఎం నుండి అదనపు లావాదేవీలకు రూ. 21 + జీఎస్టీ ​​వసూలు చేసేది. కానీ నిబంధనలను మార్చిన తర్వాత మీరు మరొక బ్యాంకు ఏటీఎం నుండి ఎక్కువ లావాదేవీలను చేస్తే మీరు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందట.

తాజాగా ఎస్బిఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ పొదుపు ఖాతాలపై ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. మెట్రో, నాన్ మెట్రోలోని అన్ని ఖాతాదారులకు ప్రతి నెలా SBI ఏటీఎం లలో 5 లావాదేవీలు, ఇతర బ్యాంకు ఏటీఎం లలో 10 లావాదేవీలు లభిస్తాయట. దీనితో పాటు, 25 నుండి 50 వేల మధ్య AMB ఉన్న ఖాతాదారులకు అదనంగా 5 లావాదేవీలు లభిస్తాయట. అదనంగా రూ. 50 వేల నుండి రూ. లక్ష వరకు ఏఎంబీ ఉన్న కస్టమర్లకు 5 అదనపు లావాదేవీలు లభిస్తాయట. దీనితో పాటు ఏఎంబీ రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుందట. బ్యాలెన్స్ ఎంక్వయిరీ , మినీ స్టేట్‌మెంట్ మొదలైన సేవలకు, ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు వర్తించవు అని తెలిపింది ఎస్బిఐ.

అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే, ప్రతి లావాదేవీకి మీకు రూ.10 + జీఎస్టీ ​చెల్లించాల్సి ఉంటుందట. మీ పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేనందున మీ ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయితే, ఇప్పటికే వర్తించే విధంగా జరిమానా రూ. 20 + జీఎస్టీ ​​అలాగే ఉంటుందట. మే 1, 2025 నుండి అమలులోకి వచ్చే ఏటీఎం ఇంటర్‌చేంజ్ రుసుమును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ఇప్పుడు బ్యాంకులు మే 1, 2025 నుండి గరిష్ట ఏటీఎం ఉపసంహరణ ఛార్జీని ప్రతి లావాదేవీకి రూ.23 కి పెంచవచ్చు. ఎస్‌బీఐ కూడా ఏటీఎం నుండి అదనపు లావాదేవీలు చేస్తే, వారు కూడా ప్రతి లావాదేవీకి రూ.23 చెల్లించాల్సి ఉంటుందట. కాబట్టి ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసే వారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందే.

Exit mobile version