దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ధరలను కూడా అందిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 40 వేల వరకు డిస్కౌంట్ ని అందిస్తోంది శాంసంగ్ సంస్థ. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ ఆఫర్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ తన లేటెస్ట్ మోడల్ గ్యాలక్సీ ఎస్24పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. అన్ని రకాల ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 40 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రమోషనల్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు శాంసంగ్ తాజాగా తెలిపింది. శాంసంగ్ వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో రూ.60 వేల లోపు ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ వేరియంట్ ధర లాంచింగ్ సమయంలో రూ. 74,999గా ఉండేది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లోపై ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ కింద రూ. 12,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో పాటు అదనంగా రూ. 3000 అప్‌గ్రేడ్ బోనస్ ను కూడా అందిస్తున్నారు.
వీటితో పాటు ఈ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 40 వేల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.2 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను కూడా ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ లో 25 వాట్ల చార్జింగ్, ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్ 2.0, వైర్ లెస్ పవర్ షేర్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.