Site icon HashtagU Telugu

Galaxy A05s: శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. కేవలం రూ. 11 వేలకే సొంతం చేసుకోండిలా?

Mixcollage 14 Jan 2024 02 40 Pm 9951

Mixcollage 14 Jan 2024 02 40 Pm 9951

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్ ఇటీవల గెలాక్సి ఏ05ఎస్‌ పేరుతో ఒక స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై అదనంగా డిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై సామ్‌సంగ్‌ రూ. 2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఇక డిస్కౌంట్‌ తర్వాత ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ను రూ. 11,499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే 6జీ వేరియంట్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను రూ. 12,999కి పొందొచ్చు. సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్‌ సైట్స్‌లో ఆ ఆఫర్‌ లభిస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 689 ప్రాసెసర్‌ను అందించారు. లైట్‌ వయలెట్, బ్లాక్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఇక ఇందులో 6. 71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగినఈ ఫోన్‌ 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version