Site icon HashtagU Telugu

Samsung galaxy A06: శాంసంగ్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?

Mixcollage 30 Jul 2024 12 54 Pm 4213

Mixcollage 30 Jul 2024 12 54 Pm 4213

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అలాగే ఇప్పటికీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ లను కూడా ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలో శాంసంగ్ సంస్థ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ06 పేరుతో ఈ ఫోన్‌ ను తీసుకొస్తున్నారు.

ఈ ఫోన్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ను అందించనున్నారు. కాగా ఈ ఫోన్‌ లో 15 వాట్స్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెసాపిటీతో కూడిన బ్యాటరీని కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ను బ్లాక్‌ కలర్‌ లో లాంచ్‌ చేయనున్నారు. గ్యాలక్సీ ఎ06 స్మార్ట్‌ ఫోన్‌ లో 6.7 ఇంచెస్‌ తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఇకపోతే ధర విషయానికొస్తే.. ధర విషయంపై ఇప్పటివరకు శాంసంగ్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె లాంటి ఫీచర్ లను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారట. ఈ ఫోన్‌లో రెయిర్‌ సైడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో టైప్‌ సీ పోర్ట్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను గ్యాలక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లలో మాదిరిగా కీ ఐలాండ్‌తో రానుంది.