Site icon HashtagU Telugu

Foldable Phone: భారత్ మార్కెట్ లోకి రెండు మడత ఫోన్లు.. పూర్తి వివరాలు ఇవే!

Foldable Phones

Foldable Phones

భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల మడత ఫోన్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అయిన శాంసంగ్‌, షావోమి, మోటోరోలా కంపెనీలు కొత్త మడత ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఈ మడత ఫోన్ల పైనే ఆసక్తిని కనబరుస్తుండడంతో మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా మడత ఫోన్ లనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా భారత మార్కెట్లోకి రెండు మడత ఫోన్లు విడుదల అయ్యాయి.

శామ్ సంగ్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్లు అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ను తాజాగా భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇందులో జెడ్ ఫోల్డ్ 4 ధరలు రూ.1,54,999 నుంచి ప్రారంభం కానుండగా, జెడ్ ఫ్లిప్ 4 ధరలు రూ.89,999 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ లైన్ స్టోర్లు, అలాగే ఆన్ లైన్ లోనూ ఈ ఫోన్ కోసం ముందస్తుగా ఆర్డర్లు తీసుకుంటున్నట్టు శామ్ సంగ్ సంస్థ ప్రకటించింది.

ఈ శామ్ సంగ్ మడత ఫోన్ లలోని ఫీచర్ల విషయానికి వస్తే జెడ్ ఫ్లిప్ 4 లో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ రకాలు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.89,999, రూ.94,9999 గా వున్నాయి. అలాగే ఇందులోనే బీస్పోక్ ఎడిషన్ ధర రూ.97,999 గా ఉండగా ఈ ఫోన్ మనకు బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4లో 12జీబీ, 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్, ఒక టీబీ ర్యామ్ తో వస్తుంది. వీటిల్లో ఆరంభం మోడల్ ధర రూ.`54,999 అయితే, టాప్ మోడల్ ధర రూ.1,84,999. గ్రే గ్రీన్, బీజ్, పాంథాన్ బ్లాక్ అనే మూడు రకాల్లో ఇది లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కొనుగోలు చేసే వారికి.. గెలాక్సి ఫోన్ 4 ను రూ.2,999కే అందిస్తోందటీ. ఆలాగే హెచ్ డీఎఫ్ సీ కార్డులపై రూ.8,000 డిస్కౌంట్ ఇస్తోందట.