Samsung Phones: మార్కెట్ లోకి శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిం

  • Written By:
  • Updated On - March 12, 2024 / 06:21 PM IST

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అలాగే ఇప్పటికీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ను కూడా ప్రకటిస్తోంది. ఇకపోతే వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.

ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లేపేను అందించారు. దీనికి గొరిల్లా గ్లాస్​ విక్టస్​ ప్రొటెక్షనన్‌ ను కూడా ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఇన్​-హైస్​ ఎక్సినోస్​ 1480 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు.

ఇక సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీ ఫ్రట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో లో- లైట్​ ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఇమేజ్​ సిగ్నల్​ ప్రాసెసింగ్​ ఉంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ పై ఇది పనిచేస్తుంది. ఇక శాంసంగ్​ గెలాక్సీ ఏ35 5జీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ను అందించారు. ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్​ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ బేస్డ్‌ వన్​ యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. ద నాక్స్​ 3.1 ప్రొటెక్షన్​ లభిస్తోంది. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీని కూడా అందించారు.