Site icon HashtagU Telugu

New Smartphones: 2024 జనవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 29 Dec 2023 03 02 Pm 5196

Mixcollage 29 Dec 2023 03 02 Pm 5196

కొత్త ఏడాది మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. కొన్ని అద్భుతమైన అడ్వాన్స్ ఫీచర్లతో మంచి మంచి స్పెసిఫికేషన్లోతో 2024లో అనేక రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. మరి వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు వాటి వివరాల విషయానికొస్తే..

వన్‌ప్లస్ 12.. వన్‌ప్లస్ కంపెనీ 2024 జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 12 మోడల్‌ను ఆవిష్కరించనుంది. దీని ధర దాదాపుగా రూ. 60,000 వరకు ఉండవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ LTPO ప్యానెల్‌తో, 6.82-అంగుళాల 2K సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. లేటెస్ట్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ దీంట్లో ఉంటుంది. 16జీబీ ర్యామ్ , 512జీబీ స్టోరేజ్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 64ఎంపీ టెలిఫోటో లెన్స్, 48ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

వివో X100 సిరీస్.. ఇండియాలో ఫోన్ల అమ్మకాల పరంగా కొన్నాళ్లుగా టాప్ ప్లేస్‌లో నిలుస్తున్న వివో కంపెనీ, X100 సిరీస్‌ను 2024, జనవరి 4న రిలీజ్ చేయనుంది. ఈ సిరీస్‌లో వివో X100, వివో X100 ప్రో మోడళ్లు ఉంటాయి. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో డివైజ్‌లు వస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ఉండే ఈ ఫోన్లు 16జీబీ ర్యామ్ , 1టీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో రానున్నాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కెమెరాలు, వైర్డు 100W, వైర్‌లెస్ 50W ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో X100 ప్రో కస్టమర్లను ఆకర్షిస్తుందట.

రెడ్‌మీ నోట్ 13 సిరీస్.. చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి, 2024 జనవరి 4న భారతదేశంలో రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. క్వాల్‌కామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 5G చిప్‌సెట్‌ కాంబినేషన్‌, 12జీబీ ర్యామ్ , ఆండ్రాయిడ్ 13 బేస్ట్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి స్పెసిఫికేషన్లతో ఫోన్లు రానున్నాయి. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ ఏకంగా 200ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. 120W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S24.. ఈ ఫోన్ వచ్చే నెలలో దక్షిణ కొరియాలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో వనిల్లా, ప్లస్, అల్ట్రా వేరియంట్లు ఉన్నాయి. సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్, 200ఎంపీ ప్రైమరీ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లపై హైప్ క్రియేట్ అయింది. గెలాక్సీ S24 అల్ట్రా మోడల్‌లో ఉండే 5,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.