Samsung Galaxy S24 : శాంసంగ్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ?

మామూలుగా మన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలంటే మనకు నచ్చిన స్మార్ట్ ఫోన్ షాప్స్ కి వెళ్లి కొనుగోలు చేస్తూ ఉంటాం. లేదంటే కొన్ని కొన్ని సార్ల

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 04:00 PM IST

మామూలుగా మన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలంటే మనకు నచ్చిన స్మార్ట్ ఫోన్ షాప్స్ కి వెళ్లి కొనుగోలు చేస్తూ ఉంటాం. లేదంటే కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొంచెం సరికొత్తగా ఆలోచించింది శాంసంగ్. మొబైల్ ఫోను ఏకంగా 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ వచ్చే విధంగా ఒక అద్భుతమైన విధానాన్ని తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ గతవారం కంపెనీ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌లు ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల అనగా జనవరి 31 నుంచి మొదటిసారిగా అమ్మకానికి రానున్నాయి.

ఈ విక్రయానికి ముందు, శాంసంగ్ హైపర్-లోకల్ డెలివరీ కంపెనీ బ్లింకిట్‌తో కలిసి ఎంపిక చేసిన నగరాల్లో గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను డోర్‌స్టెప్ డెలివరీని అందించింది. ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల్లోనే కొత్త హ్యాండ్‌సెట్‌లను కొనుగోలుదారులకు డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లోతాజాగా అనగా జనవరి 25 న లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను బ్లింకిట్‌లో ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ముంబైలోని కస్టమర్‌లు గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్‌లను డోర్‌స్టెప్ డెలివరీ కోసం ఇన్‌స్టంట్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల కన్నా తక్కువ సమయంలో హ్యాండ్‌సెట్‌లు డెలివరీ అవుతాయి అని బ్లింకిట్ పేర్కొంది.

ఇతర ఆన్‌లైన్ రిటైలర్లు హ్యాండ్‌సెట్‌లను డెలివరీ చేసేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతుంది. బ్లింకిట్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా గెలాక్సీ ఎస్24 సిరీస్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన చెల్లింపులకు గెలాక్సీ ఎస్24 బేస్ 8జీబీ + 256జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 79,999, గెలాక్సీ ఎస్24 ప్లస్ ధర రూ. 99,999, గెలాక్సీ ఎస్24 అల్ట్రా ప్రారంభ ధర రూ. 1,29,999కు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఇకపోతే శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్ల విజయానికి వస్తే.. గెలాక్సీ ఎస్24 ఫోన్ 8జీబీ ర్యామ్ ప్యాక్ చేస్తుంది. అయితే, టాప్-ఎండ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ 12జీబీ ర్యామ్ అందిస్తాయి.

గెలాక్సీ ఎస్24 అల్ట్రా అన్ని ప్రాంతాలలో స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 ఎస్ఓసీ ఫర్ గెలాక్సీ అని పిలిచే స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 ఎస్ఓసీ ట్వీక్డ్ వెర్షన్‌లో రన్ అవుతుంది. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల భారత వేరియంట్‌లు హుడ్ కింద ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ‌ని కలిగి ఉన్నాయి. మూడు ఫోన్‌లు ఐపీ68-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ 200ఎంపీ ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని క్వాడ్ కెమెరా సెటప్‌తో అమర్చింది. సాధారణ మోడల్‌లు 50ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయి. గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 45డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 15డబ్ల్యూ ఛార్జింగ్ వేగాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్ ప్యాక్ 4,000 ఎంఎహెచ్, 4,900ఎంఎహెచ్ బ్యాటరీలు వరుసగా 25డబ్ల్యూ, 45డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తాయి.