Samsung Galaxy S23 FE 5G శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ.. ఫీచర్స్ చూసేయండి..!

Samsung Galaxy S23 FE 5G భారత్ లో బలమైన మార్కెట్ కలిగిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్

  • Written By:
  • Updated On - September 23, 2023 / 09:59 AM IST

Samsung Galaxy S23 FE 5G భారత్ లో బలమైన మార్కెట్ కలిగిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ కస్టమర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉంది. లేటెట్ గా ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్ గెలాసీ ఎస్ 23 ఎఫ్.ఈ 5జీ ఫోన్ ని ఆవిష్కరిస్తుంది. అమేజాన్ వేదికగా శాంసంగ్ 5జీ ప్రీమియం ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఫోన్ ఎక్సోనోస్ 2200 ఎస్వోసీ చిప్ సెట్ తో స్నాప్ డ్రాగం 8 జెన్ ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ వివరాలను తెలుపుతూ శాంసంగ్ ఇండియా ఎక్స్ ఖాతాలో న్యూ ఎపిక్ కమింగ్ సూన్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ స్మార్ట్ ఫోన్ కి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉందని తెలుస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ డీటైల్స్ లోకి వెళ్తే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో కూడ్ ట్రిపుల్ రేర్ కెమెరా లు కలిగి ఉంటుంది. దీనితో పాటుగా 8 మెగా పిక్సెల్ సెకండరీ కెమ్రా, 12 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇంకా సెల్ఫీల కోసం 10 మెగా పిక్సెల్ ఫ్రెండ్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy S23 FE 5G 4500 ఎం.ఏ.హెచ్ కెపాసిటీ బ్యాటరీ తో 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ యాక్సెస్ కలిగి ఉంటుంది. శాంసంగ్ ప్రీమియం 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ పై పనిచేస్తుంది. నాలుగేళ్లుగా ఓఎస్ అప్డేట్స్ తో పాటుగా ఐదేళ్లు సెక్యురిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది.

ఇక స్క్రీన్ విషయానికి వస్తే 6.4 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉన్న ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎస్.ఈ ధర విషయానికి వస్తే 128 జీబీ ఇంటర్న స్టోరేజ్ వేరియంట్ అయితే 54,999 రొ.లు, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అయితే 59,999 రూ.లుగా ఫిక్స్ చేశారు. అయితే ఇదివరకు శాంసంగ్ రిలీజ్ చేసిన గెలాసీ ఎస్ 23 ధర కన్నా ఇది చాలా తక్కువగా వస్తుంది.

Also Read : Sign Languages Day : భాష రాకున్నా భావం భళా.. ఇవాళ సంకేత భాషా దినోత్సవం