Samsung Galaxy S23: గెలాక్సి ఎస్23 పై బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.. వివరాలివే?

శాంసంగ్ కంపెనీ మార్కెట్ లోకి ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Samsung Galaxy S23

Samsung Galaxy S23

శాంసంగ్ కంపెనీ మార్కెట్ లోకి ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శాంసంగ్ ఫోన్స్ కి భారత మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో శాంసంగ్ సంస్థ తన మార్కెట్ ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఈ క్రమంలో నేను కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేయడంతో పాటు, ఆల్రెడీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాంసంగ్ సంస్థ ఇటీవలె గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను ప్రపంచ‌వ్యాప్తంగా శాంసంగ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫాంటమ్ మనకు బ్లాక్, క్రీమ్, గ్రీన్ అండ్ లాంవెండర్‌ వంటి మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. గెలాక్సీ ఎస్ 23 లైనప్‌లో అత్యంత చౌకైన మోడల్‌పై అమెజాన్ భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఆ వివరాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా అనే పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే శాంసంగ్ ఎస్ 23 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ బుకింగ్ ప్రారంభించింది. ఫిబ్రవరి 23 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రీ బుకింగ్ సందర్భంగా కంపెనీ కొన్ని ఆఫర్లను ప్రకటించింది.

గెలాక్సీ ఎస్23 లైనప్‌లో బేస్‌ మోడల్‌పై అమెజాన్ రూ.13,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో బ్యాంకు ఆఫర్స్ కూడా కలిసి ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 128జీబీ వేరియంట్ ధర 74,999 గా ఉంది. అలాగే 256జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. కాగా అమెజాన్‌లో పరిమిత సేల్ ఆఫర్‌లో భాగంగా 128జీబీ వేరియంట్ ధరతో 256జీబీ వేరియంట్‌ను పొందవచ్చు. అంటే గెలాక్సీ ఎస్ 23 256జీబీ వేరియంట్‌పై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌‌పై కొనుగోలు చేస్తే అదనంగా రూ. 8,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫైనల్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ‌ ఎస్ 23ను రూ.66,999కు సొంతం చేసుకోవచ్చు.

  Last Updated: 10 Feb 2023, 10:16 PM IST