Site icon HashtagU Telugu

Samsung Galaxy S22 FE: మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సి ఎస్22 ఎఫ్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Samsung Galaxy S22 Fe

Samsung Galaxy S22 Fe

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం మొబైల్ తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో అద్భుతమైన ధరలకే సరికొత్త మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ని మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా త్వరలో శాంసంగ్ ఎస్ 23 మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అంతే కాకుండా తన మోడ్సల్ లో ఆదరణ పొందిన ఎస్ 22 లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

ఈ ఫోన్ ఫిబ్రవరి 1, 2023న యూఎస్ లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఇటీవల రద్దు చేసిన ఏ 74 5జీ ఎడిషన్ కు ప్రత్యామ్నాయంగా ఎస్ 22 ఎఫ్ఈ ను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇకపోతే శాంసంగ్ ఎస్ 22 ఎఫ్ఈ స్పెసిఫికేషన్ ల విషయానీకి వస్తే.. ఈ మొబైల్ కొత్త శాంసంగ్ ప్రాసెసర్, కెమెరా సెన్సార్లతో రానుంది. ఇది ఎక్సినోస్ 2300 4 ఎన్ఎం చిప్ సెట్ తో ఉంటుంది తెలుస్తోంది. అలాగే 108 ఎంపీ బ్యాక్ కెమెరాతో, హెచ్ఎం 6 సెన్సార్ దీని ప్రత్యేకతగా నిలవనుంది. ఈ మొబైల్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఎస్ 23 మోడల్ కంటే ముందే ఎస్ 22 ఎఫ్ఈతో పాటుగా, శాంసంగ్ ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

త్వరలో అందుబాటులో గెలాక్సీ ఎఫ్ 14 శాంసంగ్ ఫోన్స్ ప్రజాదరణ కలిగిన గెలాక్సీ ఎఫ్ 14 ను త్వరలో భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. జనవరి లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని శాంసంగ్ ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్ లో కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించనున్నారు.

Exit mobile version