Site icon HashtagU Telugu

Samsung Galaxy S21 Fe: ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్.. రూ. 75 వేల ఫోన్ కేవలం రూ. 15 వేలకే?

Samsung Galaxy S21 Fe

Samsung Galaxy S21 Fe

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా అయితే చక్కటి శుభవార్త. సంక్రాంతి పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ భారీగా డిస్కౌంట్ ధరతో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ ఆఫర్ లభిస్తోంది. మరి ఆ ఫోను దాని ధర పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ ఫోన్‌పై ఈ డీల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను మీరు రూ. 15 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఫోన్ అసలు ధర రూ. 75 వేలుగా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 60 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా మీరు శాంసంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్ పొందొచ్చు. అయితే ఈ సేల్ జనవరి 20 వరకు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ ఫోన్ ధర రూ. 74,999. అయితే ఇది ఇప్పుడు రూ. 34,999కు లభిస్తోంది. 8 జీబీ ర్యామ్ 128 జీబీ మెమోరీ పై అంటే 53 శాతం తగ్గింపు ఉంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డు పై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల అమొలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 5జీ, గొరిల్లా గ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. అలా మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ సంక్రాతి పండుగ సందర్బంగా రూ. 74,999 ల ఫోన్ ఏకంగా ఒ
ఆఫర్స్ అన్ని కలిపి కేవలం 15 వేలకు లభిస్తోంది.

Exit mobile version