Site icon HashtagU Telugu

Galaxy S21 FE 5G: బంపర్ ఆఫర్.. రూ.75వేల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.30 వేల లోపే.. పూర్తి వివరాలివే?

Galaxy S21 Fe 5g

Galaxy S21 Fe 5g

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తీసుకురావడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఆ ఆఫర్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అసలు ధరలో సగం కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్‌తో గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ బేస్ మోడల్‌ను శామ్‌సంగ్ MRP రూ. 74,999కి విడుదల చేసింది. అయితే ఇప్పుడు విక్రయం కారణంగా దాని ధర 57% తగ్గింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 31,999లో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు చేస్తే కస్టమర్‌లు రూ. 2000 అదనపు తగ్గింపును పొందవచ్చు. SBI కార్డ్‌లతో EMI లావాదేవీలు కాకుండా, ఫ్లిప్ కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌లు, పేటిఎం వాలెట్‌తో అదనపు తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని మార్చుకునేటప్పుడు విడిగా ఎక్స్‌ఛేంజ్ తగ్గింపును పొందవచ్చు.

పాత ఫోన్‌ మోడల్, దాని పరిస్థితిని బట్టి గరిష్టంగా రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు వైట్, ఆలివ్ గ్రీన్, లావెండర్, గ్రాఫైట్ వంటి కలర్స్ లో లభిస్తోంది. ఇకపోతే Galaxy S21 FE 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఫ్యాన్ ఎడిషన్ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్‌తో 6.4 అంగుళాల డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్‌ని పొందుతుంది. దీనిని ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. కాగా కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 12ఎంపీ వైడ్ లెన్స్‌తో పాటు, 8ఎంపీ టెలిఫోటో, 12ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఇవ్వబడ్డాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ పరికరంలో 32ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. స్టీరియో స్పీకర్లతో కూడిన ఈ ఫోన్ 4500mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఇది 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. పరికరం రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.